Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు . ఈరోజు, రేపు ఆదిలాబాద్, నిర్మల్ , కోమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు ,ఖమ్మం జిల్లాలలో భారీవర్షాలు . తెలంగాణలో సాధారణం గా చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు. మరోవైపు ఒరిస్సా నుండి కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి . - రాజారావు, హైదరాబాద్ వాతావరణ శాఖ.
  • మాస్క్ ధరించకపోతే జరిమానా. గతం లో ఉన్న జరిమానా ని పెంపు. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించకపోతే జరిమానాను 200 నుండి రూ .500 కు పెంచిన గుజరాత్ అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ .
  • అమరావతి: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన సీఎం వైయస్‌.జగన్‌ . కాంట్రాక్టు ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష. సుమారు 54 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది సున్నా అని సమావేశంలో ప్రస్తావన.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • అమరావతి : మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కొడుకు సురేష్ మాజీ పీఎస్ మురళీమోహన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు. ఇప్పటికే పరారీలో ఉన్న పితానీ కొడుకు వెంకట సురేష్ వెంకట సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు. బెయిల్ ఇవ్వొద్దని కోర్టు కోరిన ఏసీబీ అధికారులు.

144 సెక్షన్‌కి.. కోడెల అంత్యక్రియలకు సంబంధం లేదు: ఐజీ

No connection between Section 144 and Kodela Siva Prasad Rao funeral says IG, 144 సెక్షన్‌కి.. కోడెల అంత్యక్రియలకు సంబంధం లేదు: ఐజీ

ఈ రోజు ఏపీలోని గుంటూరులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త తెలియగానే.. గుంటూరులోని నరసారావు పేటలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయితే.. కోడెల అంత్యక్రియలకు.. గుంటూరులోని 144 సెక్షన్ విధింపుకు ఎలాంటి సంబంధం లేదని.. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండటం కోసమే అక్కడ పరిస్థితిని కంట్రోల్‌లో ఉంచినట్లు తెలిపారు. మాజీ స్పీకర్ కోడెల అంత్యక్రియల సందర్భంగా జరిగే శాంతీయుత ర్యాలీకి.. ఈ నిషేధాజ్ఞలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కోడెల అంత్యక్రియలకు ఎలాంటి ఆటంకాలు కలగుకుండా.. చూసుకునేందుకు తగిన పోలీస్ సిబ్బందిని ఏర్పాట్లు చేసినట్లు ఐజీ వినీత్ తెలిపారు.

Related Tags