‘థాంక్ గాడ్ ! ఇండియాలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు’..కేంద్ర మంత్రి హర్షవర్ధన్

ఇండియాలో సామూహిక (కమ్యూనిటీ)  ట్రాన్స్ మిషన్ (కరోనా వైరస్) లేదని, పైగా రీకవరీ రేటు క్రమంగా రోజురోజుకీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దరి చేరకుండా నివారించగలిగామన్నారు. ప్రజల ప్రవర్తనా ధోరణిలో కూడా మార్పులు రావడం హర్షణీయమని, పర్యావరణ సంబంధ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటి వల్ల చాలావరకు ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో విజయం సాధించామని ఆయన అన్నారు. లాక్ డౌన్ పొడిగింపు అవసరాన్ని ఆయన వివరిస్తూ.. […]

'థాంక్ గాడ్ ! ఇండియాలో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదు'..కేంద్ర మంత్రి హర్షవర్ధన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 05, 2020 | 6:13 PM

ఇండియాలో సామూహిక (కమ్యూనిటీ)  ట్రాన్స్ మిషన్ (కరోనా వైరస్) లేదని, పైగా రీకవరీ రేటు క్రమంగా రోజురోజుకీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దరి చేరకుండా నివారించగలిగామన్నారు. ప్రజల ప్రవర్తనా ధోరణిలో కూడా మార్పులు రావడం హర్షణీయమని, పర్యావరణ సంబంధ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వంటి వాటి వల్ల చాలావరకు ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో విజయం సాధించామని ఆయన అన్నారు. లాక్ డౌన్ పొడిగింపు అవసరాన్ని ఆయన వివరిస్తూ.. ఎకానమీ ఎంత ముఖ్యమో. మనిషి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వం తులనాత్మకంగా వ్యవహరిస్తోంది అని చెప్పారు. కరోనా టెస్టింగులను ముమ్మరం చేశామన్నారు. మార్చి 25 కు ముందు కరోనా వైరస్ వ్యాప్తి మూడు రోజులు ఉండేదని, అయితే ఇప్పుడది 12 రోజులకు పెరిగిందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.