Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

ఆ సంచలన దర్శకుడి జాడెక్కడ..?

What is sensational director next project, ఆ సంచలన దర్శకుడి జాడెక్కడ..?

ఒక్క హిట్ ఇచ్చారంటే చాలు.. ఆ దర్శకుడికి పేరు కొన్ని నెలల పాటు అందరి నోళ్లల్లో నానుతుంటుంది. ఇక ఆ దర్శకుడి నెక్ట్స్ సినిమా ఏంటి..? ఏ స్టార్ హీరోతో తీస్తాడు..? ఎలాంటి సినిమా తీస్తాడు..? ఇలా పలు ప్రశ్నలు వరుసగా వస్తుంటాయి. అంతేనా.. ఆ దర్శకుడు ఆ స్టార్ హీరోతో తీయబోతున్నాడు..? ఈ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడు..? అంటూ పుకార్లు కూడా వినిపిస్తుంటాయి. అయితే గతేడాది ఓ సంచలన చిత్రాన్ని తీసి.. భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న దర్శకుడు మాత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నాడు. ఏడాదిన్నర దాటినా.. తన తదుపరి చిత్రంపై అతడు ఏ ప్రకటన చేయలేదు. ఇంతకు ఆయనెవరు అనుకుంటున్నారా..? నాగ్ అశ్విన్.

What is sensational director next project, ఆ సంచలన దర్శకుడి జాడెక్కడ..?

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ సాధించనప్పటికీ.. క్రిటిక్స్ హిట్‌గా నిలిచింది. ఇక రెండో సినిమాకే పెద్ద సాహసమే చేశాడు ఈ దర్శకుడు. ‘మహానటి’ సావిత్రి జీవితాన్నే తన సినిమా కథగా తీసుకొని.. తెరకెక్కించాడు. ఈ సినిమా క్రిటిక్స్ పరంగానే కాదు.. కమర్షియల్‌గానూ భారీ విజయాన్ని సాధించింది. మహానటికి ఇది నిజమైన నివాళి అంటూ సినీ ప్రముఖులు సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు పలు ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ ఈ సినిమా ప్రదర్శితం కాగా.. ఎన్నో అవార్డు, రివార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ మూవీ ద్వారా స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు నాగ్ అశ్విన్. ఒక యంగ్ డైెరెక్టర్ అయినప్పటికీ.. ఆయన సినిమాలో నటించేందుకు మెగాస్టార్ చిరంజీవినే ఆసక్తి చూపాడంటే.. నాగ్‌ అశ్విన్‌కు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ మూవీ విడుదలై ఏడాదిన్నరకు పైగానే అయ్యింది. కానీ తదుపరి మూవీపై మాత్రం నాగ్ అశ్విన్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.

What is sensational director next project, ఆ సంచలన దర్శకుడి జాడెక్కడ..?

మహానటి విజయోత్సవంలో భాగంగా ఓ సందర్బంలో మాట్లాడిన చిరంజీవి.. తన తదుపరి చిత్రం నాగ్ అశ్విన్‌తో ఉండబోతుందని తెలిపారు. అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారని, టైం మిషన్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని వివరించారు. కానీ చిరు త్వరలో కొరటాలతో సెట్స్ మీదకు వెళుతున్నారు. ఈ మూవీ తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో ఇప్పుడే సినిమా లేదని కొందరు అంటున్నారు. ఇక మరోవైపు విజయ్‌ దేవరకొండతో నాగ్ అశ్విన్ తదుపరి చిత్రం ఉంటుందని వార్తలు వచ్చినా.. అవి కూడా రూమర్లుగానే ఉండిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో నాగ్ అశ్విన్ నెక్ట్స్ మూవీపై కాలమే సమాధానం చెప్పాలి.

అయితే ఇటీవల ఈ దర్శకుడు ప్రొడ్యూసర్‌గా మారాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ‘జాతి రత్నాలు’ అనే చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి దర్శకుడిగా ఇప్పటికే స్టార్ ‘ముద్ర’ను వేసుకున్న నాగ్ అశ్విన్.. ప్రొడ్యూసర్‌గా ఏ మాత్రం మెప్పిస్తారో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.