Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

ఓటీటీ కంటెంట్‌కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!

Government Refuses To Censor OTT Platforms, ఓటీటీ కంటెంట్‌కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!

ఈ మధ్యకాలంలో యువత థియేటర్లలో సినిమాల చూడటం మీద కంటే.. ఆన్లైన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌పై వెబ్ సిరీస్‌లను వీక్షించడంలో ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. దీన్ని బట్టే ఓటీటీలకు ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇదంతా ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ కంటెంట్ పేరిట సెన్సార్ అనేది లేని కొత్తరకమైన ఎంటర్టైన్మెంట్ తయారవ్వడమే కాకుండా వల్గారిటీ, బూతులు కూడా ఎక్కువ అయిపోయాయి. ఇక వీటిపైన ఆకర్షితులైన యువత చెడు మార్గాల వైపు అడుగులు వేసే అవకాశం కూడా లేకపోలేదన్నది కొందరి భావన.

అందుకే నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్‌‌, జీ5 మొదలగున ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు సెన్సార్ తప్పనిసరి చేయాలని కొందరు కోర్టు మెట్లు కూడా ఎక్కారు. అయితే ఇంకా ఈ ప్రతిపాదన మీనమేషాల దశలోనే ఉంది. ఇక తాజాగా ఈ అంశంపై ఇటీవల జరిగిన సి2 బిగ్ పిక్చర్ సమిట్ 2019కు హాజరైన కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ అమిత్ ఖరే పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Government Refuses To Censor OTT Platforms, ఓటీటీ కంటెంట్‌కు నో సెన్సార్.. కేంద్రం కీలక నిర్ణయం!

ఓటీటీ కంటెంట్‌పై సెన్సార్ విధించినే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని అమిత్ ఖరే స్పష్టం చేశారు. ఇక కట్టడి పేరుతో కత్తెర వేసే అడ్డంకి లేకపోవడంతో ఇప్పటికే మన దర్శకులు రెచ్చిపోయి మరీ వివిధ రకాల జోనర్లలో వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నారు. వాటికి మంచి వ్యూవర్‌షిప్ కూడా దక్కుతోంది.