హరీష్.. ఔట్ అఫ్ స్టేషన్!

TRS Leader Harish Rao, హరీష్.. ఔట్ అఫ్ స్టేషన్!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా.. లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంలో పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. ఇప్పటివరకు తన నియోజకవర్గానికే పరిమితమైన హరీష్ రావు.. మెదక్ ఎంపీ స్థానంలో పార్టీకి కీలక విజయం అందించడంతో.. తనదైన మార్క్ రాజకీయాన్ని చూపించాడు. ఇది ఇలా ఉండగా రేపు అనగా జూన్ 3న తన పుట్టినరోజు నాడు ఏవిధమైన వేడుకలు జరపవద్దని.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు సూచించాడు.

తన పట్ల ఉన్న ప్రేమను సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల ద్వారా చాటాలని మాజీ మంత్రి హరీష్ రావు తన అభిమానులకు సూచించారు. రేపు సిద్ధిపేట, హైదరాబాద్ లో తాను అందుబాటులో ఉండటం లేదని, తనను ఆశీర్వదించాడు వస్తామంటూ ఫోన్లు చేస్తున్న వారికీ ధన్యవాదాలని ఆయన ట్వీట్ చేశారు. కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల వల్ల తాను దూరంగా ఉండాల్సి వస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *