ఆ రోజు విజయోత్సవాలను నిర్వహించరాదు: సీపీ

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మొదటి అంచెలో స్థానిక పోలీసులతో, మధ్యలో సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, టీఎస్‌పీఎస్సీతో భద్రత కల్పిస్తామన్నారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో అదనపు బలగాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రానికి డీసీపీ స్థాయి అధికారిని బాధ్యులుగా నియమించామని చెప్పారు. ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి 24 […]

ఆ రోజు విజయోత్సవాలను నిర్వహించరాదు: సీపీ
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 9:36 PM

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. మొదటి అంచెలో స్థానిక పోలీసులతో, మధ్యలో సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, టీఎస్‌పీఎస్సీతో భద్రత కల్పిస్తామన్నారు. లెక్కింపు కేంద్రం లోపల కేంద్ర బలగాలతో భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో అదనపు బలగాలు ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రానికి డీసీపీ స్థాయి అధికారిని బాధ్యులుగా నియమించామని చెప్పారు. ఈ నెల 23న ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు నగరంలో 144 సెక్షన్‌ అమలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా దాదాపు 5 వేలకు పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధించినట్లు సీపీ అంజనీకుమార్‌ స్పష్టంచేశారు.