ఎక్కడో కాదు.. మన దేశంలోనే..! బుర్ఖా ధరిస్తే పెనాల్టీ కట్టాల్సిందేనట..!

ఓ వైపు దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష పార్టీలు.. ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీహార్‌ రాష్ట్రంలోని ఓ వుమెన్స్ కళాశాల వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. పాట్నాలోని జేడీ మహిళా కళాశాల యాజమాన్యం ముస్లిం విద్యార్ధినిలకు ఓ రూల్ పెట్టింది. కాలేజ్‌లోకి బుర్ఖా ధరించి రావొద్దని హుకుం జారీ చేసింది. అంతేకాదు.. తప్పని సరిగా డ్రెస్ కోడ్ కూడా పాటించాలని నియమాలు పెట్టింది. దీనికి సంబంధించి ఓ నోటీసును కూడా కళాశాల […]

ఎక్కడో కాదు.. మన దేశంలోనే..! బుర్ఖా ధరిస్తే పెనాల్టీ  కట్టాల్సిందేనట..!
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 7:43 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా సీఏఏను వ్యతిరేకిస్తూ.. ప్రతిపక్ష పార్టీలు.. ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీహార్‌ రాష్ట్రంలోని ఓ వుమెన్స్ కళాశాల వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

పాట్నాలోని జేడీ మహిళా కళాశాల యాజమాన్యం ముస్లిం విద్యార్ధినిలకు ఓ రూల్ పెట్టింది. కాలేజ్‌లోకి బుర్ఖా ధరించి రావొద్దని హుకుం జారీ చేసింది. అంతేకాదు.. తప్పని సరిగా డ్రెస్ కోడ్ కూడా పాటించాలని నియమాలు పెట్టింది. దీనికి సంబంధించి ఓ నోటీసును కూడా కళాశాల ప్రాంగణంలో అతికించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు డ్రెస్‌కోడ్‌ తప్పనిసరిగా వేసుకోవాలని.. నిబంధనలు అతిక్రమిస్తే ఫైన్ కూడా విధించబోతున్నట్లు కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. డ్రెస్ కోడ్ పాటించని విద్యార్ధులకు రూ.250 పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. కేవలం శనివారం రోజు మాత్రమే డ్రెస్‌కోడ్‌కు మినహాయింపు ఉంటుందని వివరించారు.

కాగా, జేడీ కళాశాల తీసుకున్న నిర్ణయంపై ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధినులు నిరసనలకు దిగారు. డ్రెస్ కోడ్ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం వెనక్కితగ్గింది. వివాదంపై మీడియా ప్రతినిధులు కళాశాల ప్రిన్సిపల్‌ను ప్రశ్నించగా.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.