నాపై కాల్పులు జరపకండి.. కాశ్మీర్ లో ఉగ్రవాది లొంగుబాటు

జమ్మూకాశ్మీర్ లో ఓ ఉగ్రవాది తనపై కాల్పులు జరపవద్దని భద్రతా దళాలను  వేడుకుంటూ వఛ్చి లొంగిపోయాడు. ఈ మధ్యే ఇతగాడు  ఉగ్రవాదుల్లో చేరాడు. నిండా పాతికేళ్ళు లేని ఇతని పేరు జహంగీర్ భట్ అట. నాపై ఫైర్ చేయవద్దు..అని దూరం నుంచి నడుచుకుంటూ వఛ్చి జహంగీర్ లొంగిపోయిన వీడియోను సైన్యం రిలీజ్ చేసింది. ఇతని నుంచి ఏకే-47 రైఫిల్ ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తన కుమారుడికి హాని తలపెట్టకుండా వదిలివేసినందుకు జహంగీర్ తండ్రి సైన్యానికి […]

నాపై కాల్పులు జరపకండి.. కాశ్మీర్ లో ఉగ్రవాది లొంగుబాటు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 10:33 AM

జమ్మూకాశ్మీర్ లో ఓ ఉగ్రవాది తనపై కాల్పులు జరపవద్దని భద్రతా దళాలను  వేడుకుంటూ వఛ్చి లొంగిపోయాడు. ఈ మధ్యే ఇతగాడు  ఉగ్రవాదుల్లో చేరాడు. నిండా పాతికేళ్ళు లేని ఇతని పేరు జహంగీర్ భట్ అట. నాపై ఫైర్ చేయవద్దు..అని దూరం నుంచి నడుచుకుంటూ వఛ్చి జహంగీర్ లొంగిపోయిన వీడియోను సైన్యం రిలీజ్ చేసింది. ఇతని నుంచి ఏకే-47 రైఫిల్ ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. తన కుమారుడికి హాని తలపెట్టకుండా వదిలివేసినందుకు జహంగీర్ తండ్రి సైన్యానికి కృతఙ్ఞతలు తెలిపాడు. జమ్మూ కాశ్మీర్ లో ఓ  కుర్ర ఉగ్రవాది లొంగిపోవడం ఇదే మొదటిసారి.