నిందితులకు పూలమాలలతో వెల్ కమ్.. సమస్యే కాదన్న యూపీ ప్రభుత్వం

Accused Grand Welcome with garland In UP, నిందితులకు పూలమాలలతో వెల్ కమ్.. సమస్యే కాదన్న యూపీ ప్రభుత్వం

యూపీలోని బులంద్ షహర్ లో జరిగిన ఘర్షణల్లో హింసను రెచ్ఛగొట్టారన్న కేసుకు సంబంధించి నిందితులైన కొందరు జైలు నుంచి విడుదల కాగా.. వారికి వారి అనుచరులు పూలమాలలతో స్వాగతం చెప్పారు. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితుల్లో ఏడుగురు జైలు నుంచి బయటకు రాగానే.. వారికి ‘ హీరోయిక్ వెల్ కమ్ ‘ లభించింది. పైగా వారి సహచరులంతా ఆ సమయంలో ‘ జై శ్రీరామ్ ‘ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది గతంలో జరిగిన అల్లర్లలో సుబోధ్ కుమార్ సింగ్ అనే ఇన్స్పెక్టర్ పై దాడి జరగగా.. ఆ దాడిలో ఆయన మరణించాడు. ఈ హత్యా నేరం కింద వీరు అరెస్టయి.. జైలుకెళ్లారు. కాగా.. బెయిలుపై రిలీజయిన . నిందితులకు పూలమాలలతో స్వాగతం చెబుతారా అని నెటిజన్లు, ప్రతిపక్ష పార్టీల వారు పెద్దఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే -ఈ ‘ నిర్వాకం ‘ లో తమ ప్రమేయమేదీ లేదని యూపీ ప్రభుత్వం పేర్కొంది. జైలు నుంచి ఎవరైనా విడుదల అయితే వారి సహచరులో, బంధువులో వారికి స్వాగతం చెబితే, దానికి ప్రభుత్వంతో గానీ, బీజేపీతో గానీ సంబంధం లేదని యూపీ డిప్యూటీ సీఎం కె.పి. మౌర్య అంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. .. గత ఏడాది డిసెంబరులో బులంద్ షహర్ సమీప గ్రామ అటవీ ప్రాంతంలో 25 ఆవుల కళేబరాలు కనిపించాయి. దీంతో అక్కడ పెద్దఎత్తున హింసాత్మక అల్లర్లు జరిగాయి. యూపీ బీజేపీ యువజన విభాగానికి చెందినవారిగా భావిస్తున్న కార్యకర్తలతో బాటు స్థానికులు కూడా మరో వర్గంపై దాడికి దిగారు. ఈ అల్లర్లను అదుపు చేసేందుకు తన సిబ్బందితో వెళ్లిన ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ పై ఆందోళనకారులు దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ కేసుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిట్ విచారణకు ఆదేశించారు. సుబోధ్ కుమార్ హత్యకు పాల్పడినవారిగా ఏడుగురిని, అల్లర్లను ప్రేరేపించినవారిగా మరికొందరిని సిట్ పేర్కొనడంతో అందర్నీ అరెస్టు చేసి పోలీసులు జైలుకు తరలించారు. అయితే ఆ ఏడుగురు బెయిలుపై విడుదలయ్యారు. దీంతో సుబోధ్ కుమార్ సింగ్ కుటుంబం ఆందోళన చెందుతోంది. ఈ నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని భయపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *