ఢిల్లీ..’కరోనా కయ్యం’..బెడ్స్ లేవంటున్న ఆస్పత్రులు.. ఉన్నాయంటున్న యాప్ !

ఢిల్లీలో  ఆస్పత్రులకు, ప్రభుత్వానికి మధ్య  'కరోనా కయ్యం' తలెత్తింది. కరోనా రోగులకోసం పెద్దాసుపత్రుల్లో పడకల లభ్యతను తెలిపే యాప్ 'ఒకటి చెబితే'.. ఆస్పత్రులు మరొకటి చెబుతున్నాయి...

ఢిల్లీ..'కరోనా కయ్యం'..బెడ్స్ లేవంటున్న ఆస్పత్రులు.. ఉన్నాయంటున్న యాప్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 07, 2020 | 2:47 PM

ఢిల్లీలో  ఆస్పత్రులకు, ప్రభుత్వానికి మధ్య  ‘కరోనా కయ్యం’ తలెత్తింది. కరోనా రోగులకోసం పెద్దాసుపత్రుల్లో పడకల లభ్యతను తెలిపే యాప్ ‘ఒకటి చెబితే’.. ఆస్పత్రులు మరొకటి చెబుతున్నాయి. ఈ యాప్…. వివిధ హాస్పిటల్స్ లో చాలా బెడ్లు ఖాళీగా ఉన్నట్టు చూపుతుండగా.. ‘ఒట్టు.. మా ఆస్పత్రుల్లో అస్సలు ఖాళీలు లేవు’ అని హాస్పిటల్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. మాక్స్ హాస్పిటల్, ఫోర్టిస్ హాస్పిటల్, హొలీ ఫ్యామిలీహాస్పిటల్.. ఇలా ఒక్కో వైద్యశాలా ఒకే గళం వినిపిస్తున్నాయి. తమ ఆస్పత్రుల్లో కరోనా రోగులు ఫుల్లుగా ఉన్నారని, అసలు బెడ్ ఖాళీ అన్న సమస్యే లేదని ఇవి పేర్కొంటున్నాయి. బహుశా ఈ యాప్ లోనే ఏదో ఫాల్ట్ ఉండవచ్ఛునని ‘మాక్స్’ తప్పిదాన్ని ఆ యాప్ మీదే తోసేసింది. దానిని అప్ డేట్ చేయడంలేదని మరో ఆసుపత్రి విమర్శించింది. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితే.. ప్రభుత్వ యాప్ మా హాస్పిటల్ లో 302 పడకలు ఉన్నట్టు చూపుతోందని, కానీ మా వద్ద 270 బెడ్లు మాత్రమే ఉన్నాయని లెక్క వేరుగా చెప్పింది.

ఇలా ఉండగా… సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తమను హెచ్చరించడాన్ని వివిధ హాస్పటల్స్ మేనేజ్ మెంట్స్ ఖండించాయి. ఓ వైపు మేము కరోనా రోగుల సేవలో ఉండగా.. మీరిలా బెదిరించడాన్ని సహించబోమని వివిధ వైద్య సంఘాలు కూడా పేర్కొన్నాయి.