సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఢోకా లేదు

కరోనా ఉత్పాతంతో దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిన వేళ ఉద్యోగాలు లేక యువతకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటు రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు తగ్గిపోగా, ప్రభుత్వ రిక్రూట్ మెంట్ల సంగతేంటన్న ప్రశ్న యువత మదిలో..

సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు ఢోకా లేదు
Follow us

|

Updated on: Sep 05, 2020 | 8:24 PM

కరోనా ఉత్పాతంతో దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోయిన వేళ ఉద్యోగాలు లేక యువతకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటు రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు తగ్గిపోగా, ప్రభుత్వ రిక్రూట్ మెంట్ల సంగతేంటన్న ప్రశ్న యువత మదిలో కొన్నాళ్లుగా మెదులుతోంది. దీనికి కేంద్రం స్పష్టత నిచ్చే ప్రయత్నం చేసింది. కరోనా వేళ కొత్తగా ఉద్యోగ నియామకాలను చేపట్టవద్దంటూ ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్ఠం చేసింది. ఈ రోజు విడుదల చేసిన కొత్త సర్క్యులర్‌ ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామక ప్రక్రియ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. శుక్రవారం నాటి సర్క్యులర్ పోస్టుల సృష్టి కోసం అంతర్గత విధానంతో మాత్రమే వ్యవహరిస్తుందని పేర్కొన్నది. భారత ప్రభుత్వంలో పోస్టులను భర్తీ చేయడానికి ఎటువంటి పరిమితి లేదా నిషేధం లేదంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా సాధారణ నియామకాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. కాగా, ప్రభుత్వ వనరులపై ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర మంత్రిత్వ శాఖలలో కొత్త పోస్టులను సృష్టించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడం విశేషం.