నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్టోబర్‌ 9న నిర్వహించేందుకు స‌ర్వ సిద్దం చేస్తున్నారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం
Follow us

|

Updated on: Oct 08, 2020 | 7:32 AM

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ అక్టోబర్‌ 9న నిర్వహించేందుకు స‌ర్వ సిద్దం చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అక్టోబర్‌ 12న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 50 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యదికంగా నిజామాబాద్ కార్పోరేషన్ లో పరిధిలో 67 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా చందూర్ లో నలుగురు ఓటర్లు ఉన్నారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ ప్రక్రియ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నిక నిర్వహణ ఉంటుందన్నారు. పోలింగ్ నిర్వహణకు 399 సిబ్బందిని వినియోగిస్తున్న అధికారులు, అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో 14 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు భారీ పోలీసు బందోబస్తుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, పోలింగ్ కేంద్రాల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ పోన్లకు అనుమతి స్పష్టం చేశారు. కాగా, 24 మంది ఓటర్లకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు అధికారులు తెలిపారు. వీరి కోసం పోస్టల్ బ్యాలెట్ ద్వారా గానీ, చివరి గంటలో ఓటు వేసే అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు.

భూపతిరెడ్డిపై అనర్హత వేటుతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను ముందే ఖరారు చేశాయి పార్టీలు. టీఆర్‌ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి యెండల లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ వ్యూహ‌త్మ‌కంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉండటంతో వారందరిని ఇప్పటికే క్యాంపునకు తరలించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి ఒక్క ఓటు కూడా చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉండటం అధికార టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం. ఈ నెల 3న‌ క్యాంపునకు వెళ్లి పోలింగ్ జరిగే 9వ తేదీ ఉదయం వ‌ర‌కు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వ‌చ్చేవిధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇతర పార్టీల వైపు ఏ ఒక్కరూ వెళ్లకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

కాంగ్రెస్, బీజేపీ ల‌కు పూర్తి స్థాయిలో బ‌లం లేకపోవ‌డంతో ఉన్న వారిని కాపాడుకోనే ప‌నిలో ఉన్నారు. మొత్తం మీద మాజీ ఎంపీ క‌విత‌ను భారీ మెజార్టీతో గెలిపించడ‌మే ధ్యేయంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఉమ్మ‌డి జిల్లా నేత‌లు పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధమ‌య్యారు. అందులో భాగంగా క్యాంపు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో మాజీ ఎంపీ క‌విత గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

మొత్తానికి కరోనా కారణంగా వాయిదా పడ్డ నిజామాబాద్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మె ల్సీని ఎన్నుకోనున్నారు. మొత్తం 824 మంది ప్రజా ప్రతినిధులలో 75 శాతం టీఆర్ఎస్‌కు చెందన వారే ఉన్నారు.. వీరిలో అధికారికంగా టీఆర్‌ఎ్‌సకు 570 మంది, కాంగ్రె్‌సకు 152, బీజేపీకి78, ఎంఐఎం, స్వతంత్రులు 24 మంది ఉన్నారు. మొత్తంగా కవితకు వచ్చే ఓట్ల ఆధిక్యంపైనే అందరి దృష్టి ఉంది. మొత్తం ఓట్లలో 650కి పైగా ఆమెకు వస్తాయని టీఆర్‌ఎస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.