మోదీకి ఇందూరు రైతన్న షాక్

నిజామాబాద్ : ప్రధామంత్రి మోదీ పోటీ చేయనున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ వేయడానికి ఇందూరు రైతన్నలు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళి నామినేషన్‌లు వేయాలని భావిస్తున్నారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని రైతులు మొదటి విడత ఎన్నికల్లో తమ లోక్‌సభ నియోజకవర్గం పరిధి నుంచి 178 మంది నామినేషన్‌లు వేశారు. దీంతో వివిధ పార్టీల అభ్యర్థులతో కలిసి బరిలో ఉన్నవారి సంఖ్య 185కు […]

మోదీకి ఇందూరు రైతన్న షాక్
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2019 | 11:44 AM

నిజామాబాద్ : ప్రధామంత్రి మోదీ పోటీ చేయనున్న వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ వేయడానికి ఇందూరు రైతన్నలు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్ళి నామినేషన్‌లు వేయాలని భావిస్తున్నారు. పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని రైతులు మొదటి విడత ఎన్నికల్లో తమ లోక్‌సభ నియోజకవర్గం పరిధి నుంచి 178 మంది నామినేషన్‌లు వేశారు. దీంతో వివిధ పార్టీల అభ్యర్థులతో కలిసి బరిలో ఉన్నవారి సంఖ్య 185కు చేరింది. వీరి “వినూత్న నిరసన” ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యకు జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. ఇదే స్ఫూర్తితో రైతులు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో కూడా బరిలో దిగేందుకు యోచిస్తున్నారు.