రూ.760 కోట్లకు అమ్ముడుపోయిన నిజాం నగలు..

Nizam Jewelry, రూ.760 కోట్లకు అమ్ముడుపోయిన నిజాం నగలు..

నిజాం నవాబులకు చెందిన పలు ఆభరణాలు.. న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో కోట్లమేర అమ్ముడు పోయాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత క్రిస్టీ సంస్థ.. ‘మహారాజులు, మొఘలుల వైభవం’ పేరిట నిర్వహించిన ఈ వేలంలో భారతీయ ఆభరణాలకు రూ.760 కోట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఇండియా నగలకు దక్కిన ధరల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. స్వయంగా క్రిస్టీ సంస్థే ఈ వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించింది.

గోల్కొండలో దొరికిన మిర్రర్ ఆఫ్ ప్యారడైజ్ వజ్రం అమెరికాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. 52.58 క్యారెట్ల ఈ బరువైన వజ్రం రికార్డ్ స్థాయిలో 45 కోట్ల ధర పలికింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాలలో ఒకటి ఈ గోల్కొండ వజ్రం. కాగా.. ఆర్కాట్ నవాబుకు చెందిన 17 క్యారెట్లు గోల్కొండ వజ్రం 23.5 కోట్లకు అమ్ముడుపోయింది. నిజాం నవాబుకు చెందిన వజ్రాల హారం 17 కోట్ల పలకగా.. 33 క్యారెట్ల మరో వజ్రాల హారానికి 10.5 కోట్ల ధర పలకగా.. భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు, నిజాం నవాబులకు చెందిన ఆభరణాలను ఈ వేలంలో ఉంచారు. దాదాపు 400 పురాతన వస్తువులు వేలం వేశారు.

2011లో ఎలిజబెత్ రాణి సేకరించిన వస్తువులు 14.4 కోట్ల ధర పలికాయి. ఇండోర్ మహారాజు యశ్వంత్ రావ్ హాల్కర్ 2 ధరించిన రత్నాలతో కూడిన గొలుసు 1.44 కోట్లు, జైపూర్ రాజమత గాయత్రీ దేవి ధరించిన వజ్రపుటుంగరం 4.45 కోట్లు, 1680-1720కి చెందిన వజ్రాలు పొదిగిన హుక్కా పెట్ 5.3 కోట్లు, సీతారామంజనేయుల ప్రతిమలున్న మరో హారం 5.12 కోట్లు, 5 వరసల ముత్యాల హారం 11.8 కోట్లకు అమ్ముడుపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *