Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి ‘శ్వాస’

, వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి ‘శ్వాస’

నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ ఈ నెల 29న విడుదల కానుంది. తమిళంలో విజయం సాధించిన ‘కణిథన్’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఇక ఈ మూవీ తరువాత ‘శ్వాస’ అనే చిత్రంలో నటిస్తున్నాడు నిఖిల్. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయం అవుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నివేథా థామస్‌ నటిస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ట్రావెల్ బేస్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెడ్‌స్కై ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

, వచ్చే నెల నుంచి సెట్స్‌పైకి ‘శ్వాస’