బన్నీతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ‘ఐకాన్’ అనే సినిమా చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌ను హీరోయిన్‌‌గా ఎంపిక చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. అయితే […]

బన్నీతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు!
Follow us

|

Updated on: Jul 03, 2019 | 4:21 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ‘ఐకాన్’ అనే సినిమా చేయనున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్‌ను హీరోయిన్‌‌గా ఎంపిక చేయాలని చూస్తోందట చిత్ర యూనిట్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా నివేదా ప్రస్తుతం ఏఏ 19 చిత్రంలో కీలక పాత్ర చేస్తోంది. మరోవైపు ‘చిత్రలహరి’, ‘మెంటల్ మదిలో’ చిత్రాలతో నివేదా పేతురాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.