Breaking News
  • కర్నూలు: సీఎం జగన్‌, ఎంపీ టీజీ వెంకటేష్‌ మధ్య ఆకసక్తికర చర్చ. మాకు రావాల్సిన హైకోర్టు ఎంతవరకు వచ్చిందన్న టీజీ వెంకటేష్‌. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి కోరాం. నివేదిక కూడా పంపించామన్న సీఎం జగన్‌. త్వరలోనే సానుకూల ప్రకటన రావచ్చన్న టీజీ వెంకటేష్‌. హైకోర్టు ప్రకటనపై జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన టీజీ వెంకటేష్‌.
  • ప్రజలను కలిసేందుకు చంద్రబాబు వెళ్తుంటే పోలీసుల ఆంక్షలేంటి. చంద్రబాబు పర్యటనతో వైసీపీ ఉలిక్కి పడుతోంది-కూన రవికుమార్‌. మంత్రి బొత్స నోటిని అదుపులో పెట్టుకోవాలి-కూన రవికుమార్‌. విశాఖలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారు. జగన్‌ను విశాఖ ప్రజలు తరిమికొట్టాలి-టీడీపీ నేత కూన రవికుమార్‌.
  • గోపన్‌పల్లి అక్రమ భూమ్యుటేషన్లపై విచారణకు ఆదేశం. విచారణాధికారిగా రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ నియామకం. సర్వే నెంబర్‌ 127, 128లో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి భూదందాపై.. విచారణ చేయనున్న రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ. బాధితులను విచారణకు హాజరుకావాలని ఆదేశాలు. అక్రమ భూమ్యుటేషన్ల వ్యవహారంలో మరో ఇద్దరి పాత్ర. రిటైర్డ్ తహశీల్దార్లు సుబ్బారావు, రాజేశ్వర్‌రెడ్డి పాత్ర ఉన్నట్టు గుర్తింపు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాసిన కలెక్టర్‌.
  • ఢిల్లీ: పూసాలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వార్షిక సమావేశం. పాల్గొన్న కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌గోయల్‌. తెలంగాణ నుంచి హాజరైన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 2019-20 వార్షిక నివేదిక విడుదల.
  • హైదరాబాద్‌: హిమాయత్‌నగర్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ర్యాలీ. అడ్డుకున్న పోలీసులు, సీపీఐ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట. నారాయణ, చాడ వెంకట్‌రెడ్డిని అరెస్ట్‌. నారాయణగూడ పీఎస్‌కు తరలించిన పోలీసులు.

తమిళ బ్యూటీ… మూడు పెద్ద ప్రాజెక్టులు!

Nivetha Peturaj, తమిళ బ్యూటీ… మూడు పెద్ద ప్రాజెక్టులు!

ఈ మధ్యకాలంలో తెలుగు పరిశ్రమపై ఇతర భాష హీరోయిన్ల ఆసక్తి ఎక్కువైందని చెప్పాలి. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అందరూ కూడా తెలుగు సినిమాలో నటించడం కోసం వరుసగా క్యూ కడుతున్నారు. ఇక ఈ జాబితాలో తమిళ నటి నివేదా పేతురాజ్ ఒకరు. హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగులోకి  ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇది ఇలా ఉండగా ఆమె చేతిలో ప్రస్తుతం మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటిలో రెండు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలే కావడం విశేషం. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న ఆమె వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ‘ఐకాన్’ చిత్రంలో కూడా అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇక వీటితో పాటు రామ్, కిషోర్ తిరుమల కొత్త చిత్రంలో కూడా ఆమె మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ చెన్నై చిన్నది సైలెంట్‌గా తెలుగు పరిశ్రమలో పాగా వేసేలా కనిపిస్తోంది.

Related Tags