తుఫాన్ ప్రభావంతో చిత్తూరు అతలాకుతలం.. చర్యలు చేపడుతున్న కార్పొరేషన్ అధికారులు

నివర్ తుఫాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. బుధవారం  రాత్రి 11-30 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 2-30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాన్ ప్రభావంతో  చిత్తూరు అతలాకుతలం.. చర్యలు చేపడుతున్న కార్పొరేషన్ అధికారులు
Follow us

|

Updated on: Nov 26, 2020 | 9:06 AM

నివర్ తుఫాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. బుధవారం  రాత్రి 11-30 గంటలనుంచి గురువారం తెల్లవారుజామున 2-30 గంటల మధ్య తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుఫాన్ ప్రభావంతో  చిత్తరు , కడప , కర్నూలు ,ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరులో రాత్రంతా  వర్షం కురుస్తూనే ఉంది. వర్షం తో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో భారీ వృక్షాలు నేలరాలాయి. దాంతో నగరంలోని  3 సెక్షన్ లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన  ట్రాన్సో అధికారులు  అధికారులు కూలిన చెట్లను తీసి కరెంటు‌ స్దంబాలకు మరమ్మత్తులు చేస్తున్నారు. నీవానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను తరలించేదుకు‌ కార్పొరేషన్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వరదయ్యపాలెం మండలం సిఎల్ఎన్.పల్లి వద్ద పాముల కాలువ ఉద్రుతంగా ప్రవహిస్తుండటంతో  సంతావేలూరు వరదయ్యపాలెం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మరో వైపు అరుణానది ఉద్రుతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.