Breaking News
  • ఢిల్లీ: గడచిన 24 గంటలలో60,963 కరోనా పాజిటివ్ కేస్ లు,834 మంది మృతి. భారత్ లో కరోనా కల్లోలం. 23లక్షల 29 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 23,29,639 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 6,43,948. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 16,39,600 . దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 46,091.
  • నిమ్స్ లో లాంఛనంగా ప్రారంభమైన బూస్టర్ డోసేజ్ . క్లినికల్ ట్రయల్స్ లో మొదటి దశ-రెండో దశకు మధ్యలో వాలంటీర్లకు బూస్టర్ డోసేజ్. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన వైద్య బృందం. నిన్న 11 మంది వలంటీర్లకు బూస్టర్ డోస్ ఇచ్చిన నిమ్స్ వైద్య బృందం. నేడు మరో పదిమంది వాలంటీర్లకు బూస్టర్ డోస్ ఇవ్వనున్న నిమ్స్ వైద్య బృందం.
  • బులియన్ మార్కెట్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. రూ.1,317 తగ్గిన బంగారం ధర. ఏకంగా రూ. 2,900కు పైగా తగ్గిన వెండి ధర. రూపాయి బలపడటమే కారణమన్న నిపుణులు.
  • హిందీ దృశ్యం సినిమా దర్శకుడు నిషికాంత్ కామత్ పరిస్థితి విషమం . హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిషి కాంత్. కాలేయ సిరోసిస్‌ వ్యాధి తో భాధ పడుతున్న నిషి కాంత్. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా వుంది. Icu చికిత్స పొందున్నారు . హిందీ దృశ్యం, మాదారీ, ముంబై మేరీ జాన్ వంటి హిట్ సినిమాలకు దర్శకుడు. సాచి ఆత్ ఘరత్ వంటి కొన్ని మరాఠీ చిత్రాలలో కూడా నటించారు. 2005 లో మరాఠీ చిత్రం డొంబివాలి ఫాస్ట్‌తో ఆయన దర్శకుడిగా మారారు.
  • నెల్లూరు : కరోనాతో ముగ్గురు జర్నలిస్టుల మృతి. కరోనా తో చికిత్స పొందుతూ ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మృతి. ఇందుకూరుపేట మండలానికి చెందిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు మృతి.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు జర్నలిస్టులు మృతి.
  • స‌డ‌క్ 2’ ట్రైల‌ర్ విడుద‌ల‌. గ‌తంలో సంజ‌య్ ద‌త్ న‌టించిన ‘స‌డ‌క్’ చిత్రానికి ఇది సీక్వెల్ . మహేశ్ భట్ డైరెక్ట్ చేసిన చిత్రం. సంజయ్ దత్, పూజా భట్,ఆదిత్య రాయ్ కపూర్, ఆలియా భట్ కీలక పాత్రధారులు. ఆగస్ట్ 28న డిజిటల్ మాధ్యమంలో విడుదల కానున్న ‘స‌డ‌క్ 2’.
  • తెలంగాణ కరోనా కేసుల అప్డేట్స్: తెలంగాణ లో కరోనా టెస్టింగ్స్ : 6,65,847. ఈ ఒక్కరోజే టెస్టింగ్స్: 22,972. రాష్ట్రంలో ఈరోజు పాజిటివ్ కేసులు : 1897. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు : 84,544. జిహెచ్ఎంసి లో ఈరోజు కేసులు: 479. జిహెచ్ఎంసి లో మొత్తం కరోనా కేసులు సంఖ్య : 43,858. కరోనా తో ఈరోజు మరణాలు : 09. ఇప్పటి వరకూ మరణాలు మొత్తం : 654. చికిత్స పొందుతున్న కేసులు : 22,596. ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయిన వారు: 1920. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య: 61294.

కేజ్రీవాల్ విజయం.. నితీష్ మూడు ముక్కల పదం

Nitish Kumar's 3-Word Reaction To Arvind Kejriwal's Victory, కేజ్రీవాల్ విజయం.. నితీష్ మూడు ముక్కల పదం

ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ ఘన విజయంపై వ్యాఖ్యానించేందుకు బీహార్ సీఎం, జేడీ-యు అధినేత నితీష్ కుమార్ నిరాకరించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన.. చేతులు జోడించి.. ‘జనతా మాలిక్ హై’ (ప్రజలే నేతలు) అన్నారు. డిప్యూటీ సీఎం బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీతో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితీష్ కుమార్ పాల్గొన్నారు.

నితీష్ నేతృత్వంలోని జేడీ-యు పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసింది. (నితీష్ స్వయంగా మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు). అయితే రెండు నియోజకవర్గాల్లోనూ జేడీ-యు ఓడిపోయింది. కేజ్రీవాల్ ను ఎదుర్కొనేందుకు బీజేపీ.. తన ఈ మిత్రపక్షంతో చేతులు కలపడం ఇదే మొదటిసారి. ఇలా ఉండగా.. బీహార్ బయట జేడీ-యు బీజేపీతో చేతులు కలపరాదని రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హెచ్చరించారు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల్లో ఈ పోకడను సహించబోనన్నారు. సీఏఏ, ఎన్నార్సీ ల విషయంలో నితీష్, పీకే మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. పీకే వైఖరిపై ఆగ్రహం చెందిన నితీష్ జేడీ..యు నుంచి ఆయనను బహిష్కరించారు.

 

 

 

 

 

 

Related Tags