Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం 18 లక్షల 55 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 1855746 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 586298 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 1230510 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 38938 దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 52050 కరోనా కేస్ లు, 803 మంది మృతి
  • తెలంగాణ బీజేపీ కార్యాలయానికి కరోనా ఎఫెక్ట్. కార్యాలయాన్ని సోమవారం వరకు మూసి ఉంచాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం. జాతీయ పార్టీ కీలక నేతలు కరోనా బారిన పడటంతో రాష్ట్ర కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించ కూడదని నిర్ణయం.
  • అమరావతి : ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం. 3రాజధాని అంశంపై హైకోర్టు విచారణ. రాజధాని తరలింపుపై స్టే ఇచ్చిన హైకోర్టు. గవర్నర్ గెజిట్ పై స్టే ఇచ్చిన ఏపీ హైకోర్ట్.
  • రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించిన హైకోర్టు. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతున్న హైకోర్టు. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల. తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించిన హైకోర్టు.
  • అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు. కొరియాకు చెందిన సీఈఓ, డైరెక్టర్ సహా మొత్తం 12 మందికి కండిషన్ బెయిల్ ఇస్తూ ఆదేశాలు. స్టెరైన్ గ్యాస్ నిల్వ లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నమోదైన కేసులో వీరిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు.
  • Ccmb డైరెక్టర్ రాకేష్ మిశ్రా . జర్నల్స్ పై ఫార్మాకంపెనీల వత్తిడిపై ట్విట్టర్లో స్పందించిన Ccmb డైరెక్టర్. సైంటిస్టులు, జర్నల్స్ పై వివిధ ఫార్మాకంపెనీలు వత్తిడి చేయడం సరి కాదు. దైవంలా భావించే జర్నల్స్ మీద ఒత్తిడి సిగ్గుచేటు. ఆర్థికంగా బలమైన ఫార్మా కంపెనీలు తమ పరిశోథన పత్రాలను ప్రచురించమని వత్తిడిచేయడం సరైందికాదు . తమ పరిశోధనలను అంగీకరించమని జర్నల్స్ పై వత్తిడి మంచిది కాదు. ది లాన్సేంట్, ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లు వివిధ కంపెనీల వత్తిడిని బయటపెట్టడం ఆందోళన కల్గిస్తోంది.
  • మరో మూడు కార్పొరేట్‌ ఆస్పత్రులకు కోవిడ్ సేవలు కట్...! హైదరాబాద్ లో కరోనా ట్రీట్ మెంట్ చేస్తున్న మరికొన్ని ఆస్పత్రులకు ఆరోగ్య నోటీసులు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం యాక్షన్ .

మహారాష్ట్రలో ‘ నితిన్ ‘ ఫార్ములా ! వర్కవుట్ అయ్యేనా ?

nitin gadkari's sudden flight to nagpur as time runs out in maharashtra, మహారాష్ట్రలో ‘ నితిన్ ‘ ఫార్ములా ! వర్కవుట్ అయ్యేనా ?

మహారాష్ట్ర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన ప్రతిష్టంభనలో మార్పు లేదు. అసెంబ్లీ కాల పరిమితి ముగియడానికి ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. . 50 :50 ప్రాతిపదికపై చెరి సగం అధికారాన్ని పంచుకోవాలని శివసేన పట్టుబడుతూనే ఉంది. అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. ఆయన తన అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకుని గురువారం నాగపూర్ బయలుదేరారు. ఆ నగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసి తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో భేటీ అయ్యారు. nitin gadkari's sudden flight to nagpur as time runs out in maharashtra, మహారాష్ట్రలో ‘ నితిన్ ‘ ఫార్ములా ! వర్కవుట్ అయ్యేనా ?
సేనతో ఏర్పడిన డెడ్ లాక్ ని [పరిష్కరించాలంటే..బీజేపీ ఓ కొత్త ఫార్ములాను రూపొందించడం విశేషం. . నితిన్ గడ్కరీ పేరును ‘ ముఖ్యమంత్రి అభ్యర్థి ‘ గా ‘ రాజీ ప్రతిపాదన ‘ చేస్తే ఎలా ఉంటుందని ఈ పార్టీ యోచిస్తోంది. అయితే ఇందుకు సేన ఒప్పుకుంటుందా అన్నది సందేహమే !. కాగా… నితిన్ కేవలం రెండు గంటల్లో సమస్యను పరిష్కరిస్తారని శివసేన నేత కిషోర్ తివారీ.. మోహన్ భగవత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారు.
మరోవైపు.. తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను ‘డబ్బుతో కొనేందుకు ‘ బీజేపీ యత్నిస్తోందని శివసేన తన పత్రిక ‘ సామ్నా ‘ లో ఆరోపించింది. అధికారాన్ని చెరి సగం పంచుకోవాలని తాము ముందే ప్రతిపాదించామని, ఇందుకు మొదట ఒప్పుకున్న బీజేపీ ఇప్పుడు వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందంటూ బీజేపీ నాయకులు చేస్తున్న హెచ్ఛరికలకు బెదిరేది లేదని సేన పేర్కొంది. అటు-ఇక్కడ సేన-బీజేపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ స్పష్టం చేసినప్పటికీ.. మారుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ సేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. సేన-కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కార్ ఏర్పాటుకు తాము రెడీ అని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు కూడా..కానీ ఆయన ప్రతిపాదనను శివసేన తేలిగ్గా తీసుకోవడం గమనార్హం. సేన నేత సంజయ్ రౌత్ రెండు సార్లు పవార్ తో భేటీ అయినా,, ఈ పార్టీ అధిష్టానం దానిపై పెద్దగా స్పందించలేదు.

Related Tags