కంగనాపై నిత్యామీనన్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..?

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథపై కోలీవుడ్‌లో ముగ్గురు దర్శకులు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ ‘తలైవి’గా.. నిత్యామీనన్‌తో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’గా.. రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్‌ ‘ది క్వీన్‌’గా(వెబ్ సిరీస్) అమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వీటన్నింటి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ నటిస్తోన్న జయలలిత బయోపిక్‌(తలైవి)కు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌లు ఇటీవల విడుదలయ్యాయి. అందులో అమ్మ పాత్రకు కంగనా అంతగా […]

కంగనాపై నిత్యామీనన్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 26, 2019 | 3:35 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితకథపై కోలీవుడ్‌లో ముగ్గురు దర్శకులు పోటీ పడుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ ‘తలైవి’గా.. నిత్యామీనన్‌తో ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’గా.. రమ్యకృష్ణతో గౌతమ్ మీనన్‌ ‘ది క్వీన్‌’గా(వెబ్ సిరీస్) అమ్మ జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వీటన్నింటి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే కంగనా రనౌత్ నటిస్తోన్న జయలలిత బయోపిక్‌(తలైవి)కు సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్‌లు ఇటీవల విడుదలయ్యాయి. అందులో అమ్మ పాత్రకు కంగనా అంతగా సెట్ అవ్వలేదనే కామెంట్లు చాలా వినిపించాయి. అంతేకాదు జయలలితలా కంగనా ఇచ్చిన హావభావాలు కూడా మెప్పించలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జయలలిత పాత్రపై స్పందించిన మలయాళ కుట్టీ నిత్యామీనన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిత్యామీనన్.. జయలలిత పాత్రకు తానే పర్‌ఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చింది. తనకు, జయలలితకు చాలా సారూప్యతలు ఉన్నాయని.. ఆమెలాగే తాను కూడా ఏదైనా ముఖం మీదే చెప్పేస్తానని తెలిపింది. ఈ బయోపిక్‌లో నటించడం వలన జయలలిత గురించి ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం వచ్చిందని నిత్యామీనన్ పేర్కొంది. అమ్మ పాత్ర కోసం తనను తాను తయారుచేసుకుంటానని.. ఆమెలా ఉండేందుకు వంద శాతం శ్రమిస్తానని ఈ మలయాళ కుట్టీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. కాగా తలైవి ఫస్ట్‌లుక్ వచ్చిన నేపథ్యంలో నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పరోక్షంగా కంగనా లుక్‌ గురించే నిత్యామీనన్ ఈ వ్యాఖ్యలు చేసిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మొత్తానికి ‘అమ్మ’గా ఎవరు ప్రేక్షకులను మెప్పిస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..