నితిన్ రెడీ.. ‘భీష్మ’ స్టార్ట్ అయ్యాడు

Bheeshma Movie, నితిన్ రెడీ.. ‘భీష్మ’ స్టార్ట్ అయ్యాడు

‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించబోయే చిత్రం ‘భీష్మ’. రష్మిక హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ చిత్రం.. తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నారు. మహిత్ సాగర్ సంగీతం అందించనున్న ఈ మూవీ జూన్ 20న సెట్స్ మీదకు వెళ్లనుంది. అఆ తరువాత మళ్లీ హ్యాట్రిక్ ఫ్లాప్‌తో డీలా పడ్డ నితిన్.. ఈ మూవీపై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *