హిట్‌ ఇచ్చిన దర్శకుడికి నితిన్ మరో ఛాన్స్‌?

హైదరాబాద్‌: యంగ్ హీరో నితిన్ కెరీర్‌లో హిట్స్ కంటే ప్లాప్స్ అధికంగా ఉన్నాయి. ఎంతో శ్రమించి మంచి స్రిప్ట్ అని భావించిన సినిమాలు కూడా నితిన్ కెరీర్‌కు బూస్ట్ అప్ ఇవ్వలేకపోయాయి. వాటిలో ‘శ్రీనివాస కల్యాణం’, ‘లై’సినిమాలను ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. అందుకే నితిన్ ఇక నుంచి ఎలాగైనా సాటిస్పై చెయ్యాలని చాలా కష్టపడి సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. నితిన్‌ సినీ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వం వహించారు. దీని తర్వాత విజయ్‌.. నాగచైతన్య కథానాయకుడిగా ‘ఒక లైలా కోసం..’ సినిమా తీశారు. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత విజయ్‌ ఏ సినిమా కోసం పనిచేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ విజయ్ కుమార్, నితిన్ కాంబినేషన్లో ఓ చిత్రం రాబోతోందని సమాచారం. ఇప్పటికే విజయ్‌ ఓ ప్రేమకథను నితిన్‌కు నరేట్‌ చేశారట. కథ హీరోకు నచ్చినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *