Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

Nithiin Engagement: “సింగిల్​ అన్నావ్..సింపుల్‌గా నిఖా పక్కా చేసుకున్నావ్”

Nithiin Engagement: Actor Nithiin gets engaged to girlfriend Shalini in Hyderabad, Nithiin Engagement: “సింగిల్​ అన్నావ్..సింపుల్‌గా నిఖా పక్కా చేసుకున్నావ్”

Nithiin Engagement:  టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. 8 ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న షాలినితో నేడు(శనివారం)  నితిన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఈ కార్యక్రమం సాంప్రదాయబద్దంగా జరిగింది. ఈ వేడకకు నితిన్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే అతికొద్దిమంది వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న ఓ హెటల్‌లో ఈ కపుల్ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతుంది.

నితిన్ షాలినికి ఎలా ప్రపోజ్ చేశాడంటే  :

2012 నుంచి నితిన్, షాలిని ఫ్రెండ్స్ అయ్యారట. ఆ తర్వాత కొద్దికాలానికి వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దీంతో మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే షాలినికి ప్రపోజ్ చెయ్యడానికి కాస్త డిఫరెంట్ పద్దతిని ఎన్నుకున్నాడట నితిన్. ఒంటికాలిపై నిల్చుని వెరైటీగా ప్రపోజ్ చేశాడట. నితిన్ వేషాలు చూసి తనలో తాను నవ్వుకున్న షాలిని..వెంటనే అతని ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసిందట. ఫిబ్రవరి 14 నాడు వాలెంటైన్స్ డే సందర్భంగా తన నెక్ట్స్ మూవీ ‘భీష్మ’ లోని సింగిల్ యాంథెమ్ రిలీజ్ చేసి..ఆ తదుపరి రోజే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు నితిన్. దీంతో “సింగిల్​ అన్నావ్..సింపుల్‌గా నిఖా పక్కా చేసుకున్నావ్” అంటూ సరాదాగా వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.

Related Tags