Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

భయం లేదు.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది

Nirmala Sitharaman presser: 'Inflation under control, revival signs in factory output'

దేశంలో ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి భయాలు అవసరం లేదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో ద్రవ్యోల్పణం అదుపులోనే ఉందని ఇది 4 శాతం లోపు ఉందని తెలిపారు. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.
బ్యాంకింగ్ రంగంలో కీలకమైన రేట్ల తగ్గింపుతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని, ప్రభుత్వ బ్యాంకుల్లో రుణ వితరణ పెరుగుతున్నట్టుగా మంత్రి తెలిపారు. ఈ నెల 19న బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఎగుమతులపై పన్నులను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే సూచలను ఉన్నాయని నిర్మలా చెప్పారు. 2019 20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించిన స్ధాయిలోనే ఉందని ఆమె తెలిపారు.

ఐటీ రిటర్న్స్‌లో జరిగే పొరబాట్లకు గతంలో ఉన్నట్టుగా పెద్ద చర్యలు ఉండబోవంటూ భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి. పరిశ్రమలు స్ధాపించేవారికి, ఎగుమతులు చేసేవారికి సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భారత్ తన స్ధానాన్ని కొనసాగిస్తున్నట్టుగా నిర్మలా పేర్కొన్నారు. 2014లో భారత్‌ ర్యాంకు 142 ఉంటే.. 2018లో 77వ ర్యాంక్‌కు చేరుకుందన్నారు. ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కొత్త పథకం ఎంఈఐఎస్‌ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఇది అమల్లోకి వస్తే రూ.50 వేల కోట్లతో ఎగుమతులు పెరిగుతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మర్చి నెలలో మెగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నట్టుగా ఆమె వెల్లడించారు . కేంద్రం ఆలోచిస్తున్న విధంగా ఎంఈఐఎస్ పథకం అమల్లోకి వస్తే దీనిద్వారా టెక్స్‌టైల్ పరిశ్రమ వంటి రంగాలతో పాటు ఇతర రంగాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రిర నిర్మలా స్పష్టం చేశారు. సగంలో నిలిచిపోయిన గ‌ృహ నిర్మాణాలకు సంబంధించి ఆర్దిక సాయం కింద కేంద్ర రూ.10 వేలకోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థికమంత్రి తెలిపారు.