ఎస్ బ్యాంక్ కస్టమర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి హామీ..

దేశవ్యాప్తంగా ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు ఏటీఎం సెంటర్లకు, బ్యాంకులకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో ఎస్ బ్యాంక్ వ్యవహారంపై స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్. ఖాతాదారులకు భరోసా కల్పిస్తూ...

ఎస్ బ్యాంక్ కస్టమర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి హామీ..
Follow us

|

Updated on: Mar 07, 2020 | 8:31 AM

ఎస్‌ బ్యాంకు వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది..భయాందోళనకు గురవుతున్న ఖాతాదారులు.. తమ సొమ్ము వస్తుందా? లేదా అనే ఆందోళనలో పడ్డారు. బ్యాంకులో డిపాజిట్ చేసినదాని పరిస్థితి ఏంటి..? అనే అయోమయ పరిస్థితి ఖాతాదారుల్లో నెలకొంది.. ఈ క్రమంలోనే ఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న తమ నగదు ను డ్రా చేసుకునేందుకు అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లకు, బ్యాంకులకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలోనే ఎస్ బ్యాంక్ వ్యవహారంపై స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్.

ఎస్ బ్యాంక్ ఖాతాదారులకు అభయమిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్. అకౌంట్ లలో ఉన్న నగదు సురక్షితంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎస్ బ్యాంక్ ను గట్టెక్కించేలా ఆర్బీఐ గరవ్నర్ శక్తికాంత్ దాస్ తో చర్చించినట్లు తెలిపారు. ఎస్‌ బ్యాంకు వ్యవహారంపై సత్వర పరిష్కారం కనుగొనే దిశగా ఆర్‌బీఐ అధికారులు కృషి చేస్తున్నారని, ప్రభుత్వం, ఆర్‌బీఐ కలిసి పనిచేస్తాయని, ఖాతాదారులకు భయం అవసరం లేదని భరోసా కల్పించారు. అకౌంట్ హోల్డర్ల శ్రేయస్సే లక్ష్యంగా కేంద్రం, ఆర్బీఐ కలిసి పని చేస్తాయన్న సీతారామన్ ..తక్షణ కర్తవ్యంగా రూ.50వేల నగదు డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు.ఖాతాదారులు, బ్యాంకు, ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొనే చర్యలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.