క్రిమినల్స్ కి టికెట్లు ఇస్తారా ? సొంత పార్టీపై కాంగ్రెస్ నేత ఫైర్

మహిళలపై నేరాలకు పాల్పడుతూ నిందితులుగా ముద్ర పడినవారికి బీహార్ ఎన్నికల్లో టికెట్లు  ఇవ్వరాదన్న అభ్యర్థనను  కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెడుతోందని ఈ పార్టీ నేత, నిర్భయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన  సర్వేష్ తివారీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అభ్యర్థుల ఎంపిక సజావుగా లేదని, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆడవారిపై నేరాలకు పాల్పడే వారికి టికెట్లు ఇవ్వరాదని మహిళా కాంగ్రెస్ చీఫ్ సుష్మితా […]

క్రిమినల్స్ కి టికెట్లు ఇస్తారా ? సొంత పార్టీపై కాంగ్రెస్ నేత ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 17, 2020 | 12:18 PM

మహిళలపై నేరాలకు పాల్పడుతూ నిందితులుగా ముద్ర పడినవారికి బీహార్ ఎన్నికల్లో టికెట్లు  ఇవ్వరాదన్న అభ్యర్థనను  కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెడుతోందని ఈ పార్టీ నేత, నిర్భయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన  సర్వేష్ తివారీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అభ్యర్థుల ఎంపిక సజావుగా లేదని, ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆడవారిపై నేరాలకు పాల్పడే వారికి టికెట్లు ఇవ్వరాదని మహిళా కాంగ్రెస్ చీఫ్ సుష్మితా దేవి చేసిన విజ్ఞప్తిని అధిష్టానం పట్టించుకోలేదన్నారు. గోవింద్ గిరి నుంచి పోటీ చేయదలచిన సర్వేష్ తివారీకి పార్టీ టికెట్ లభించలేదు.

బీహార్ ఎన్నికల్లో 70 సీట్లకు [పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ …. 49 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా బంకిపూర్ నుంచి, శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి యాదవ్ బిహార్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు.