నిర్భయ కేసులో మరో ఊహించని ట్విస్ట్..

 నిర్భయ కేేసులో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.  దోషులలో ఒకడైన ముకేశ్ కుమార్ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను​ క్షమాభిక్ష పెట్టాల్సిందిగా అర్జీ పెట్టుకున్నాడు. ఈ  విషయాన్ని తిహార్ జైలు అధికారులు కన్పార్మ్ చేశారు.  2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. జనవరి  22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కానున్న నేపథ్యంలో ఆఖరి ఛాన్స్‌గా క్షమాభిక్ష ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. […]

నిర్భయ కేసులో మరో ఊహించని ట్విస్ట్..
Follow us

|

Updated on: Jan 14, 2020 | 8:51 PM

 నిర్భయ కేేసులో మరో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.  దోషులలో ఒకడైన ముకేశ్ కుమార్ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను​ క్షమాభిక్ష పెట్టాల్సిందిగా అర్జీ పెట్టుకున్నాడు. ఈ  విషయాన్ని తిహార్ జైలు అధికారులు కన్పార్మ్ చేశారు.  2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు మరణ శిక్ష విధించింది. జనవరి  22న ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు కానున్న నేపథ్యంలో ఆఖరి ఛాన్స్‌గా క్షమాభిక్ష ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నిర్భయ కేసులో దోషులైన వినయ్ శర్మ(26), ముకేశ్ కుమార్(32) క్యురేటివ్ పిటిషన్లు దరఖాస్తు చేసుకోగా, సుప్రీం కోర్టు వాటిని కొట్టివేసింది. అయితే ఉరిని జాప్యం చేసేందుకు దోషులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టు వారి అడుగులు చూస్తుంటే అర్థం అవుతోంది.