నిర్భయ దోషుల మౌనం.. లీగల్ ప్రాసెస్ జాప్యానికేనా ?

నిర్భయ దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో జైలు అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ వారు సమాధానం చెప్పలేదు. చివరిసారి మీ కుటుంబ సభ్యులను కలుసుకోవాలనుకుంటున్నారా.. లేదా మీ ఆస్తులేవైనా ఉంటే వాటిని ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నారా వంటి ప్రశ్నలకు వారు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిని, ఎప్పుడు ఆఖరు సారిగా కలుసుకోవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు కూడా వారి […]

నిర్భయ దోషుల మౌనం.. లీగల్ ప్రాసెస్ జాప్యానికేనా ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2020 | 11:37 AM

నిర్భయ దోషులు నలుగురినీ ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో జైలు అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ వారు సమాధానం చెప్పలేదు. చివరిసారి మీ కుటుంబ సభ్యులను కలుసుకోవాలనుకుంటున్నారా.. లేదా మీ ఆస్తులేవైనా ఉంటే వాటిని ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నారా వంటి ప్రశ్నలకు వారు సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిని, ఎప్పుడు ఆఖరు సారిగా కలుసుకోవాలనుకుంటున్నారన్న ప్రశ్నకు కూడా వారి నుంచి మౌనమే ‘ సమాధాన మైంది’ నిర్భయ దోషులైన ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ సింగ్, పవన్ గుప్తాలు .. ఈ ప్రశ్నలకు నోరు విప్పలేదని తీహార్ జైలు వర్గాలు తెలిపాయి. అంటే తమను ఉరి తీయకుండా మరింత కాలం న్యాయ ప్రక్రియను జాప్యం చేయాలన్నదే వీరి ఉద్దేశంగా కనబడుతోందని అంటున్నారు. ఈ దోషులను ఉరి తీయడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని నిర్భయ తలిదండ్రులతో సహా అనేకమంది విమర్శిస్తున్నారు.

ఉరిశిక్షకు సంబంధించిన కేసుల్లో మార్గదర్శక సూత్రాలను మార్చాలని కేంద్రం బుధవారం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును కోరింది. దీనివల్ల లీగల్ మార్గాల ద్వారా తమ ఉరిశిక్ష వాయిదా పడేలా దోషులు తప్పించుకోవడానికి వీలు పడదని ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రస్తుత నిబంధనలు వీరిపట్ల ‘ఉదారంగా’ ఉన్నట్టు కనిపిస్తున్నాయని, చట్టంతో ఆటలాడుకుంటూ ఉరిని జాప్యం చేయడానికి వీరికి వెసులుబాటును కల్పించేలా ఉన్నాయని ప్రభుత్వం  తన పిటిషన్ లో పేర్కొంది. డెత్ వారెంట్ మీద సంతకం పెట్టిన అనంతరం పిటిషన్ల దాఖలుకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించాలని కూడా కేంద్రం అభ్యర్థించింది.