Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

వీళ్ళు ఎన్నిసార్లు జైలు రూల్స్ బ్రేక్ చేశారంటే ?

Four convicts in Nirbhaya gang rape case whose execution is just a week away, వీళ్ళు ఎన్నిసార్లు జైలు  రూల్స్ బ్రేక్ చేశారంటే ?

నిర్భయ కేసు దోషులు అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ ‘ ఆలాటోళ్లు ..ఇలాటోళ్లు ‘ కారు.. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఈ ఏడేళ్ల కాలంలో వీళ్ళు 23 సార్లు జైలు నిబంధనలను అతిక్రమించారట. జైల్లో తాము చేసిన పనులకు లక్షా 37 వేల రూపాయల వేతనం పొందారని  తెలిసింది.వినయ్ 11 సార్లు, ముకేశ్ మూడు సార్లు, పవన్ 8 సార్లు, అక్షయ్ ఒకసారి రూల్స్ ని బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కాలంలో ఈ నలుగురిలో ముకేశ్ ఎలాంటి లేబర్ పని చేయడానికి నిరాకరించాడట.. అయితే అక్షయ్ తాను చేసిన పనులకు 69 వేలు, పవన్ 29 వేలు, వినయ్ 39 వేల రూపాయల వేతనం సంపాదించారని సమాచారం.  ఇక వీళ్ల ‘ చదువుల గోల ‘ విషయానికి వస్తే.. ముకేష్, పవన్, అక్షయ్ పదో తరగతి అడ్మిషన్ కోసం పరీక్షలకు హాజరైనా ఫెయిలయ్యారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

2015 లో వినయ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్ పొందినప్పటికీ.. దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. ఈ నలుగురు దోషులనూ ఉరితీసేందుకు సంబంధించి సన్నాహాలు జోరందుకుంటున్నాయి. వీరిని వేర్వేరు  సెల్స్ లో ఉంచి వీరి కదలికలను సీసీటీవీ ద్వారా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.అటు-గత ఆదివారం ‘డమ్మీ ఉరితీత’ పనులను అధికారులు నిర్వహించారు. ఈ దోషులు నలుగురినీ ఒకేసారి ఉరి తీయనున్నారు. వీరికి మరణశిక్షను అమలు పరచేందుకు మీరట్ నుంచి తలారి  పవన్ జలాద్ ను రప్పిస్తున్నట్టు  యూపీ అధికారులు ధృవీకరించారు. ఒక్కో దోషిని ఉరితీసేందుకు అతనికి 15 వేల రూపాయల ‘ పారితోషికాన్ని ‘ చెల్లించనున్నారు. అంటే మొత్తం  రూ. 60 వేలు లభించనున్నాయి. తనకు లక్ష రూపాయల వరకు వస్తుందని ఆశించిన అతనికి ఈ సమాచారం కొంత నిరాశాజనకమే.