Nirbhaya Convicts: తీహార్ జైల్లో హైడ్రామా.. గోడకు తలను కొట్టుకున్న దోషి వినయ్ శర్మ

Nirbhaya Convicts: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయ కేషులో దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్ష విధించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో నిర్భయ కేసుల్లో ఓ దోషి అయిన వినయ్ శర్మ తీహార్ జైలులో హల్‌చల్ చేశాడు. జైలులో గోడకు తలను గట్టిగా కొట్టుకొని.. తనను తాను గాయపరుచుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడే ఉన్న […]

Nirbhaya Convicts: తీహార్ జైల్లో హైడ్రామా.. గోడకు తలను కొట్టుకున్న దోషి వినయ్ శర్మ
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 9:52 AM

Nirbhaya Convicts: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్బయ కేషులో దోషులకు మార్చి 3న ఉదయం 6గంటలకు ఉరిశిక్ష విధించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో నిర్భయ కేసుల్లో ఓ దోషి అయిన వినయ్ శర్మ తీహార్ జైలులో హల్‌చల్ చేశాడు. జైలులో గోడకు తలను గట్టిగా కొట్టుకొని.. తనను తాను గాయపరుచుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడే ఉన్న సిబ్బంది ఈ ఘటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వినయ్‌కు స్వల్ప గాయాలైనట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ఉరితీస్తున్న నేపథ్యంలో కావాలనే వినయ్ కొట్టుకుంటున్నాడని జైలు అధికారులు చెబుతున్నారు.

కాగా మానసికంగా వినయ్ పరిస్థితి బాలేదని, అతడికి ఉరి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇటీవల వినయ్ లాయర్ కోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. జైలులో వినయ్ నిరాహార దీక్ష చేస్తున్నాడని, ఇబ్బందులకు గురవుతున్నాడని అతడి తరపు లాయర్ వీపీ సింగ్ వాదించారు. అయితే ఈ వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. వినయ్‌‌ పట్ల తగిన సంరక్షణ తీసుకోవాలంటూ తీహార్ జైలు అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.