Breaking News
  • ఢిల్లీ: తెలంగాణలోని కల్వకుర్తి నుండి ఏపీ లోని కరివేన వరకు 122 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి . నూతన జాతీయ రహదారి తో హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం . కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం . ప్రాజెక్టులో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ . 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న కేంద్ర ప్రభుత్వం . 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు , నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జి నెడునూరి దిలీపాచారి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గడ్కరీ.
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేపై నటి కంగనా విమర్శలు. నేను మీలా తండ్రి సంపాదించిన ఆస్తిని తీసుకోను. అలా తీసుకోగలిగితే హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉండేదాన్ని. తండ్రి సంపాదనపై బతకడం నాకు ఇష్టం లేదు. నేను ఆత్మగౌరవంతో బతుకుతా-ట్విట్టర్‌లో కంగనా రనౌత్‌.
  • అమరావతి: సీనియర్‌ ఐఏఎస్‌ ముద్దాడ రవిచంద్ర బదిలీ. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశం. బుడితి రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగింత.
  • గీతం భూముల విషయంలో కోర్టు ఆర్డర్‌ను టీడీపీ వక్రీకరిస్తోంది. గీతం వర్సిటీ ఆధీనంలోని శాశ్వత నిర్మాణాలు మాత్రమే.. తొలగించొద్దని కోర్టు సూచించింది-ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌. గీతం వర్సిటీ ప్రాంగణంలో ఆక్రమిత భూమిని.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన భూములను.. ప్రజా అవసరాలకు ప్రభుత్వం వినియోగిస్తుంది. వైసీపీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములున్నాయంటూ.. విమర్శలు చేసే టీడీపీ నేతలు రుజువు చేయాలి-అమర్‌నాథ్‌.
  • అమెరికాలో జోరుగా సాగుతున్న ముందస్తు పోలింగ్‌. టెక్సాస్‌లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు. ఈనెల 13న మొదలైన ముందస్తు ఓటింగ్‌ ప్రక్రియ. ఇప్పటివరకు ఓటేసిన 70లక్షల మంది ఓటర్లు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఈ శతాబ్ధానికే పోలింగ్‌ శాతం రికార్డుగా మారుతుందన్న నిపుణులు . అమెరికాలో నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ . ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులు భారీ స్థాయిలో ప్రచారం .
  • టీవీ9 ఎఫెక్ట్‌: తూ.గో: ఈతకోట-గన్నవరం రహదారిపై గుంతల పూడ్చివేత . టీవీ9 కథనాలకు స్పందించిన అధికారులు . యుద్ధప్రాతిపదికన గోతులను పూడ్చుతున్న ఆర్‌ అండ్‌ బీ అధికారులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు .
  • పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరుపుకున్నాం . 75 ఏళ్లలో తొలిసారి ఇళ్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆర్‌- మంత్రి కేటీఆర్‌ . హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను సిద్ధం చేస్తున్నాం . నగరంలో నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తాం .

‘అప్పుడు నేను బాలుడ్ని.. నాకు శిక్ష తగ్గించండి ‘.. నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా

, ‘అప్పుడు నేను బాలుడ్ని.. నాకు శిక్ష తగ్గించండి ‘.. నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కూడా సుప్రీంకోర్టుకెక్కాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నన్న   తన వాదనను గత ఏడాది కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన ఉత్తర్వులను ఇతగాడు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశాడు. ఈ కేసులో తాజాగా దోషులకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. పవన్ గుప్తా.. తాను అప్పట్లో జువెనైల్ గనుక ఆ చట్ట నిబంధనలననుసరించి తనకు తక్కువ శిక్ష విధించాలని కోరాడు. గతంలో తనకు సరిగా వైద్య పరీక్షలు నిర్వహించలేదన్నాడు. ఇదిలాఉండగా.. ఈ కేసులో ముకేష్ సింగ్ మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన అనంతరం.. ఈ దోషులను ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని  తాజా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన అనంతరం.. దోషుల ఉరితీతకు, ఈ పిటిషన్ తిరస్కరించినప్పటి నుంచి 14 రోజుల వ్యవధి ఉండాలని చట్ట నిబంధనలున్నాయి.

ఉరి తేదీని ఇక వాయిదా వేయకండి.. నిర్భయ తల్లి ఆశాదేవి:

నిర్భయ కేసు దోషుల ఉరితీతను మళ్ళీ వాయిదా వేయరాదని నిర్భయ తల్లి ఆశాదేవి కోరారు. ఈ నెల 22 న వారిని ఉరి తీయవలసి ఉందని, అయితే మళ్ళీ ఫిబ్రవరి 1 కి వాయిదా వేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం కోసం ఇన్నేళ్ళుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆమె వాపోయారు. తీహార్ జైలు అధికారులతో బాటు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నేనెందుకు వ్యధ చెందాలి అని ఆమె ప్రశ్నించారు. దోషులను క్షమించాలని, వారి ఉరితీతను ఆపాలని సీనియర్  న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి తప్పు పట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇలా ఏవిధంగా మాట్లాడతారని అన్నారు. తాను ఎన్నోసార్లు ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఆమెను కలుస్తూ వచ్చానని, కానీ ఒక్కసారికూడా ఆమె తన బాగోగుల గురించి పట్టించుకోలేదని విమర్శించిన ఆశాదేవి..  ఇప్పుడు ఒక్కసారిగా దోషుల తరఫున ఆమె మాట్లాడడం ఏమిటని అన్నారు. ఇలాంటివారు రేపిస్టులను సమర్థిస్తుంటే ఇక అత్యాచారాలు ఎలా ఆగుతాయన్నారు.కాగా-మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హంతకురాలు నళినీ మురుగన్ కు క్షమాభిక్ష పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాదిరే మీరు కూడా ఈ నిర్భయ దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్.. ఆశాదేవిని కోరినట్టు వార్తలు వచ్చాయి., ‘అప్పుడు నేను బాలుడ్ని.. నాకు శిక్ష తగ్గించండి ‘.. నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా

 

Related Tags