Breaking : నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ..

పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం ప్రకారం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి రూ .329.66 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) బుధవారం తెలిపింది.

Breaking : నీరవ్​ మోదీ ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
Nirav Modi
Follow us

|

Updated on: Jul 08, 2020 | 5:40 PM

పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం ప్రకారం వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి చెందిన రూ .329.66 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలిపింది. ముంబైలోని పిఎన్‌బి బ్రాంచ్‌లో 2 బిలియన్ డాలర్లకు పైగా బ్యాంకు మోసం చేసినట్లు..  మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటోన్న వ్యాపారవేత్త నీర‌వ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీని ఈడీ విచారిస్తోంది.

జప్తు చేసిన ఆస్తుల్లో.. వోర్లి ముంబైలోని సముద్రా మహల్ బిల్డింగులోని 4 ఫ్లాటులు, సముద్రతీరాన ఉన్న ఫామ్ హౌజ్, అలీబాగ్‌లోని వ్య‌వ‌సాయ‌ భూమి, జైసల్మేర్‌లోని విండ్ మిల్లు, లండన్‌లో ఒక ఫ్లాట్, యుఎఇలో ఫ్లాట్లతో పాటు‌.. షేర్లు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయ‌ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని  ప్రత్యేక కోర్టు జూన్ 8 న నీర‌వ్ మోడీ ఆస్తులను జప్తు చేయడానికి ఈడీకి అధికారం ఇచ్చింది.