నీరవ్ మోడీ కేసులో ముంబై జైలు వీడియో ప్రదర్శన

వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీని భారత్ కు అప్పగింత కేసులో కొంత ముందడుగు పడింది. ఆయనను బ్రిటన్ ప్రభుత్వం ఇండియాకు అప్పగిస్తే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉంచవలసి వస్తుందని...

నీరవ్ మోడీ కేసులో ముంబై జైలు వీడియో ప్రదర్శన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 08, 2020 | 1:22 PM

వజ్రాల వర్తకుడు నీరవ్ మోడీని భారత్ కు అప్పగింత కేసులో కొంత ముందడుగు పడింది. ఆయనను బ్రిటన్ ప్రభుత్వం ఇండియాకు అప్పగిస్తే ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉంచవలసి వస్తుందని భారత అధికారుల తరఫున వాదిస్తున్న క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసు లండన్ కోర్టుకు తెలిపింది. ఆ జైలు తాలూకు ఇటీవలి వీడియోను కోర్టులో ప్రదర్శించింది. అలాగే కరోనా వైరస్ టెస్టింగ్, జైలు సిబ్బంది, స్టాఫ్ లను ఈ వైరస్ బారి నుంచి ప్రొటెక్ట్ చేసే వివిధ సాధనాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర ఛీట్ చేసిన నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ జైల్లో ‘ఉన్నారు’.

ఈ జైలు తాలూకు వీడియో కూడా లోగడ (2018లో) లిక్కర్ బేరన్ విజయ్ మాల్యా అప్పగింత కేసులో ప్రదర్శించిన వీడియో మాదిరే ఉంది. ఏమైతేనేం ? మాల్యా ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. ఇండియాకు తనను అప్పగించాలన్న అభ్యర్థనను సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసుకున్న అప్పీలును కోర్టు నాడు కొట్టివేసింది. ఇక  ఇండియాకుఆయన అప్పగింత తథ్యమని వార్తలు వస్తుండగా.. ఈ లీగల్ కేసులో మరికొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయంటూ బ్రిటన్ హోం శాఖ కార్యాలయం ‘కొర్రీ’ పెట్టి ఆయన అప్పగింతను అడ్డుకుంది.