Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.
  • ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. లూధియానా లోని రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 7 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది కి కరోనా పాజిటివ్. సుమారు 100 మంది సిబ్బందిని హోమ్ క్వారం టైన్ కి పంపించిన అధికారులు. డైరెక్టర్ జనరల్ (డిజి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.
  • లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు చేయుత. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 14 వేల మంది సినీ కార్మికులకు, టెలివిజన్ కార్మికులకు సొంత ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • అమరావతి: రాష్ట్రంలో నగలు, బట్టలు, చెప్పులు షాపులు తెరిచేందుకు అనుమతి. స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతి మంజూరు . అనుసరించాల్సిన విధానాల పై సర్కులర్ జారీ . పెద్ద షో రూమ్ కు వెళ్లాలంటే ముందే ఆన్లైన్ లో అనుమతి తప్పనిసరి. అన్ని షాపులో ట్రైల్ రూము లకి అనుమతి నిరాకరణ . పాని పూరి బండ్లకు అనుమతి నిరాకరణ.

జామ తింటే ‘నిఫా’ వస్తుందా..?

, జామ తింటే ‘నిఫా’ వస్తుందా..?

కేరళలో మరోసారి నిఫా వైరస్ విజృంభించింది. ఈ వ్యాధి లక్షణాలున్న పలువురు కేరళలోని ఆసుపత్రిల్లో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా ఈ ఏడాది మొదట ఓ 23ఏళ్ల స్టూడెంట్‌కు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన డాక్టర్లు.. తరువాత పరీక్షల ద్వారా అతడికి నిఫా సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఈ సంవత్సరం మొదటి నిఫా కేసు అతడి పేరు మీదే నమోదైంది. కాగా డాక్టర్ల వైద్యంతో ఆ విద్యార్థి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ వ్యాధిపై కేంద్రం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటీ.. అసలు ఆ విద్యార్థికి నిఫా ఎలా సోకిందంటూ ఆరాలు తీశారు.

ఈ క్రమంలో ఆ విద్యార్థిని ప్రశ్నించగా.. వైరస్ తనకు సోకక రెండు వారాల ముందు తాను కుళ్లిన జామకాయను తిన్నానని పేర్కొన్నాడు. అయితే జామ కాయలు తింటే నిఫా రాదని.. దానిని గబ్బిలం కొరికి ఉండొచ్చని.. స్టూడెంట్‌కు నిఫా వైరస్ సోకడానికి అదే కారణం అయ్యిండచ్చొని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు గబ్బిలం రక్త నమూనాను తీసుకున్న వారు పరీక్షల నిమిత్తం లేబోరేటరీకి పంపారు. ఇదిలా ఉంటే నిఫా వైరస్ లక్షణాలతో ఇటీవల కలామస్సరీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేరిన ఐదు మందిలో ఇద్దరు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది జంతువుల ద్వారా వ్యాపించే వైరస్. కలుషిత ఆహారం మనుషుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశము ఉంది.

Related Tags