Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

వైభవంగా జరిగిన టీవీ9 ‘తెలుగు నవ నక్షత్ర సన్మానం’

TV9 NAVA NAKSHATRA SANMANAM 2019, వైభవంగా జరిగిన టీవీ9 ‘తెలుగు నవ నక్షత్ర సన్మానం’

మెరుగైన సమాజం కోసం పాటుపడే వ్యక్తులను టీవీ9 గౌరవించింది. వారి సేవలను ప్రపంచానికి పరిచయం చేసింది. టీవీ9 భారతదేశంతో అత్యంత వేగవంతమైన, విశ్వసనీయమైన న్యూస్ నెట్‌వర్క్ అన్న సంగతి అందరికి తెలిసిందే. కాగా న్యూస్ చానల్స్ చరిత్రలో ఓ గొప్ప అవార్డుల కార్యక్రమానికి మీ అభిమాన టీవీ9 శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘తెలుగు నవ నక్షత్ర సన్మానం’ పేరుతో దక్షిణ భారతదేశంలోనే అత్యంత గ్రాండ్‌గా అవార్డ్స్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సంవత్సరం చివరినాటికి దేశంలోని టీవీ9 నెట్‌వర్క్ ఉన్న అన్ని రాష్ట్రాల్లోకి ఈ అవార్డుల కార్యక్రమాన్ని విస్తరించబోతుంది. 

సామాజిక అసమానతలు రూపు మాపడంలో, సమాజంలో మంచి ఒరవడిని తీసుకురావడానికి ప్రయత్నించిన, తమ వృత్తిలో అవిరళ కృషి సల్పిన గొప్ప వ్యక్తులకు టీవీ9 ఈ అవార్డులు ప్రదానం చేసింది. అంతేకాకుండా న్యూస్ క్రెడిబులిటీని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లిన మీడియా ప్రముఖులను కూడా టీవీ9 గౌరవించింది.

లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ న్యాయమూర్తి రామలింగేశ్వరరావు, ఫ్రొఫెసర్ శాంతి సిన్హా, ఫ్రొఫెసర్ నాగేశ్వర్, ఐపీఎస్ అధికారి కృష్ణారావులు .. ‘తెలుగు నవ నక్షత్ర సన్మానం’కార్యక్రమానికి అర్హులను ఎన్నిక చేయడంలో జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. డిసెంబర్ 21, 2019 న నోవోటెల్ హెచ్ఐసిసి హైదరాబాద్‌లో జరగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కే. చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు.. ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, సమంత లాంటివారు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కే విశ్వనాథ్‌ను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా విశ్వనాథ్.. తెలుగు సినిమాకు చేసిన క‌ృషిని అభినందించిన కేసీఆర్, త్రివిక్రమ్ లాంటి దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం గర్వకారణమన్నారు. 17 ఏళ్లగా టీవీ9 తెలుగువారి ఉన్నతికి కృషి చేస్తోందని, తాజాగా ‘తెలుగు నవ నక్షత్ర సన్మానం’ పేరుతో సమాజంలోని  అన్ సంగ్ హీరోస్‌ని ప్రపంచానికి తెలియజేసిన చానల్ కృషిని సీఎం కొనియాడారు. 

సన్మానం అందుకున్న వారిలో  సామాజిక వేత్త మీరా సనాయి,  పోలీస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త రామాంజనేయులు, వ్యాపారవేత్త శ్రీకాంత్ బొల్ల, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల వ్యవస్థాపకులు గుళ్లపల్లి నాగేశ్వర్‌రావు,  డీఆర్డీవో చీఫ్ సతీశ్‌రెడ్డి, బాట్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, మెదక్‌ జిల్లా మూసాయిపేట ట్రైన్ యాక్సిడెంట్ నుంచి విద్యార్థులను కాపాడిన రుచితగౌడ్..తదితరులు ఉన్నారు. టీవీ9 మేనేజ్‌మెంట్ తరుఫున  జూపల్లి రామేశ్వర్‌రావు ఈ సన్మాన కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.