Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1076 కొత్త పాజిటివ్ కేసులు,11 మంది మృతి. ఢిల్లీవ్యాప్తంగా 140232 కేసులు నమోదు. 10072 యాక్టీవ్ కేస్ లు. 126116 మంది డిశ్చార్జ్. మొత్తం 4044 మంది మృతి
  • రెండు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కృష్ణ నీటి పంపకాలు చేపట్టిన కృష్ణ మేనేజ్మెంట్ బోర్డు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటాగా 37.672 టీఎంసీలు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాటాగా 17 టీఎంసీలు.
  • చెన్నై: చెన్నై విమానాశ్రయం లో వరుసగా పట్టుబడుతున్న బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా తరలిస్తున్న 731 గ్రాముల బంగారం స్వాధీనం . పట్టుబడ్డ బంగారం విలువ 35 లక్షలు ,బంగారాన్ని పేస్ట్ రూపం లో మార్చి అక్రమ రవాణా చేస్తున్న ముఠా . తంజావూర్ కి చెందిన ఇద్దరు అరెస్ట్ చేసి విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు . నిన్న సాయంత్రం 83 లక్షలు విలువ చేసే 1 .48 కేజీల బంగారం పట్టుకున్న అధికారులు.
  • విజయవాడ: బీజేపీ నుండి మరో నేత సస్పెండ్. పార్టీ లైన్ కి భిన్నంగా మాట్లాడుతున్న వారిని వరసగా సస్పెండ్ చేస్తున్న బిజెపి. ఇప్పటికే పలువురు నేతలు సస్పెండ్.. మరి కొంత మందికి నోటీసులు ఇచ్చిన ఏపీ బీజేపీ. లేటెస్ట్ గా మరొకరు తిరుపతి కి చెందిన ఓ వి రమణ సస్పెండ్. మూడు ముక్కలాట లో నష్టపోతున్న బీజేపీ అని ఒక దిన పత్రికలో ఆర్టికల్ రాసిన తిరుపతి కి చెందిన బీజేపీ నేత ఓ వి రమణ .
  • అమరావతి: ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ బిల్లుకు గవర్నర్ ఆమోదం. ఆక్వా అభివృద్ధి, ఆక్వా కల్చర్ మానిటర్, ప్రమోట్, రెగ్యులేషన్ లక్ష్యాలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథార్టీ చట్టాన్ని రూపొందించిన ప్రభుత్వం. ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం.

కరోనా నుంచి బయటపడి ప్లాస్మా దానం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

కరోనా నుంచి కోలుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది కూడా ప్లాస్మాను దానం చేశారు. రాజస్థాన్‌లోని 126 బెటాలియన్‌కు చెందిన పలువురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. అయితే వీరిలో కొందరు కరోనా నుంచి..
Nine BSF Personnel Donate Plasma In Rajasthan, కరోనా నుంచి బయటపడి ప్లాస్మా దానం చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దాటికి సామాన్య ప్రజల నుంచి మొదలు.. రాజ్యాలకు చెందిన అధ్యక్షులు కూడా గజగజ వణికిపోతున్నారు. ఈ వైరస్‌కు ప్రాంతం, కులం, మతం, రంగు, భాష, పేద, ధనిక అన్న సమాజిక తేడా ఏం లేదు. అన్ని వర్గాలను ఈ వైరస్ టచ్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోన మహమ్మారి సోకగా.. లక్షల మంది కరోనా బారినపడి మరణించారు. అయితే దీనిక వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు కరోనా బారినపడి మరణిస్తున్నారు. వీరిని రక్షించేందుకు వైద్యులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో వైద్యులు ప్లాస్మా థెరపీ చేసి.. కరోనాతో పోరాడుతున్న వారిని వైద్యులు రక్షిస్తున్నారు. ఈ థెరపీ చేయడంతో అనేక మంది తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలతో పోరాడుతున్న వారిని వైద్యులు రక్షించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు ఈ థెరపీ చేస్తున్నారు. ఇందుకోసం ప్లాస్మా సేకరించేందుకు పలు రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

తాజాగా.. కరోనా నుంచి కోలుకున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది కూడా ప్లాస్మాను దానం చేశారు. రాజస్థాన్‌లోని 126 బెటాలియన్‌కు చెందిన పలువురు బీఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. అయితే వీరిలో కొందరు కరోనా నుంచి బయట పడి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ప్లాస్మాను దానం చేస్తే.. కరోనా బారినపడ్డ వారిని కొందరినైనా కాపాడవచ్చన
సంగతి తెలిసిన జవాన్లు.. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వెంటనే జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలో తొమ్మిది మంది బీఎస్ఎఫ్ జవాన్లు ప్లాస్మాను దానం చేశారు.

Related Tags