ఆరు నెలలు ఆలస్యంగా వస్తున్న ‘అర్జున్‌ సురవరం’: నిఖిల్

నిఖిల్‌ హీరోగా థ్రిల్లర్‌ నేపథ్యంలో రాబోతున్న సినిమా అర్జున్‌ సురవరం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఈ నెల 29న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిఖిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 6 నెలలు ఆలస్యంగా విడుదలవుతోందని తెలిపారు. చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యమవుతాయని.. కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా మా సినిమా విడుదల లేటయిందని వాపోయాడు. కొందరు వ్యక్తుల కారణంగానే సినిమా రిలీజ్ […]

ఆరు నెలలు ఆలస్యంగా వస్తున్న 'అర్జున్‌ సురవరం': నిఖిల్
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 1:57 AM

నిఖిల్‌ హీరోగా థ్రిల్లర్‌ నేపథ్యంలో రాబోతున్న సినిమా అర్జున్‌ సురవరం. ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సినిమా ఈ నెల 29న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిఖిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘మే నెలలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 6 నెలలు ఆలస్యంగా విడుదలవుతోందని తెలిపారు. చాలా సినిమాలు ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యమవుతాయని.. కానీ ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా మా సినిమా విడుదల లేటయిందని వాపోయాడు. కొందరు వ్యక్తుల కారణంగానే సినిమా రిలీజ్ లేటయిందని తెలిపాడు. థియేటర్ల యజమానులు ముందుకు వచ్చినా డిస్ట్రిబ్యూటర్ల కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యమైందని విన్నవించాడు.

ఈ సినిమా తనకు చాలా నచ్చిందని తెలిపాడు నిఖిల్.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమా రిలీజ్‌ కోసం తాను చాలా కష్టపడ్డానన్నాడు. ఈ సినిమాకు తాను సగం రెమ్యూనరేషన్‌ మాత్రమే తీసుకున్నానని, తన కెరీర్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారని తెలిపాడు. డైరెక్టర్ సంతోష్ ఫినిషింగ్ కోసం నటులను ఎంత కష్టమైనా పడేలా చేస్తాడని.. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో బాగా నటించిందని వివరించాడు నిఖిల్. ఇక మీదట రీమేక్ సినిమాల్లో నటించనని తెలిపాడు. డిసెంబర్ లో షూటింగ్ జరుపుకోనున్న కార్తికేయ సినిమా సీక్వెల్ లో,  ‘హనుమాన్’ పేరుతొ రోబోటిక్స్ డ్రాప్ బ్యాక్ లో మరో సినిమా చేస్తున్నట్లు చెప్పారు.