నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ‘కార్తికేయ – 2 ‘

2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా […]

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  'కార్తికేయ - 2 '
Follow us

|

Updated on: May 31, 2019 | 5:50 PM

2014 లో యువకథానాయకుడు నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ’ చిత్రం విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే. అప్పటినుంచే ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనుందన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికది నిజమవుతోంది.

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం ను ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కథానాయకుడు నిఖిల్ పుట్టినరోజు జూన్ 1 సందర్భంగా అధికారికంగా వెల్లడి చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ..’నిఖిల్ హీరోగా దర్శకునిగా నా తొలి చిత్రం ‘కార్తికేయ’ ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో మా కాంబినేషన్ లో రూపొందనున్న ‘కార్తికేయ – 2 ‘ చిత్రం పై అంచనాలు అధికంగానే ఉంటాయన్న ది వాస్తవం. దీనికి తగినట్టుగానే ఈ చిత్రం ఉంటుంది. ‘కార్తికేయ’ కు కొనసాగింపుగా ‘కార్తికేయ – 2 ‘ ఉంటూనే కధా,కధనాల విషయంలో సరికొత్తగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ సీక్వెల్ ఈచిత్రం అన్నారు.

‘కార్తికేయ – 2 ‘ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చిత్రంలోని ఇతర నటీ,నట సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత,దర్శకులు తెలిపారు. తమ కథానాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నిర్మాత టి.జి.విశ్వప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్ వివేక్ కూచిభొట్ల. కథ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.