స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

నష్టాలతో సతమతమవుతూ అయిదు నెలల కనిష్ఠానికి చేరిన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభపడ్డాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 37,118పాయింట్లకు చేరగా, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 10,997 వద్ద ముగిసింది. ఉదయం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. చైనా వస్తువులపై దిగుమతి సుంకాన్ని అమెరికా మరో 10శాతం పెంచడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 105పాయింట్లు కోల్పోయింది. అయితే, ఆ […]

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
Follow us

| Edited By:

Updated on: Aug 02, 2019 | 5:01 PM

నష్టాలతో సతమతమవుతూ అయిదు నెలల కనిష్ఠానికి చేరిన దేశీయ సూచీలు ఎట్టకేలకు లాభపడ్డాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 37,118పాయింట్లకు చేరగా, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 10,997 వద్ద ముగిసింది.

ఉదయం స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. చైనా వస్తువులపై దిగుమతి సుంకాన్ని అమెరికా మరో 10శాతం పెంచడం మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 105పాయింట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్న మార్కెట్లు చివరికి లాభాలతో ముగిశాయి.

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, మారుతీ సుజుకీ, ఐషర్‌ మోటార్స్‌ తదితర షేర్లు లాభపడగా, ఇండియా బుల్స్‌ హెచ్‌ఎస్‌జీ, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా తదితర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.