మాజీ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసు, బారాముల్లాలో ఎన్ఐఏ దాడులు

మాజీ డీఎస్పీ దవీందర్ సింగ్, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తన దర్యాప్తు వేగాన్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని అనేకప్రాంతాల్లో  మంగళవారం ఈ సంస్థ దాడులు నిర్వహించింది.

మాజీ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసు, బారాముల్లాలో ఎన్ఐఏ దాడులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 22, 2020 | 12:23 PM

మాజీ డీఎస్పీ దవీందర్ సింగ్, హిజ్ బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది నవీద్ బాబు కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తన దర్యాప్తు వేగాన్ని పెంచింది. జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని అనేకప్రాంతాల్లో  మంగళవారం ఈ సంస్థ దాడులు నిర్వహించింది. మాజీ ప్రభుత్వ అధికారి రసూల్ వాజా, అతని కుమారుల ఇళ్లలో సోదాలు జరిపినట్టు ఈ సంస్థవర్గాలు తెలిపాయి. రసూల్ కొడుకులైన ముస్తాక్ అహ్మద్ వాజా, ఫరూక్ అహ్మద్ వాజా ఇద్దరూ గతంలో అక్రమ ఆయుధజల సేకరణ, ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ కోసం వాస్తవాధీన రేఖ దాటి వెళ్లారని, ఇప్పటివరకు తిరిగిరాలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి.అటు-సస్పెండయిన డీఎస్పీ  దవీందర్ సీంన్గ్ కథువా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.