Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

తమిళనాడులో పలు చోట్ల సోదాలు: ఎన్ఐఏ

NIA, తమిళనాడులో పలు చోట్ల సోదాలు: ఎన్ఐఏ

గతనెలలో తమిళనాడులో మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా అనే ఇద్దరు వ్యక్తుల నివాసాలపై దాడులు చేసిన ఎన్ఐఏ, తాజాగా ఏకకాలంలో 10 ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. మహ్మద్ ఆసిఫ్, సైదుల్లా ఐసిస్ మద్దతుదారులన్న ఆరోపణలతో దాడులు చేసిన ఎన్ఐఏ అప్పట్లో కీలక సమాచారం రాబట్టింది. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు తమిళనాడులో పది ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.

రామనాథపురం, సేలం, చిదంబరం, లాలాపేట, ముత్తుపేట, దేవీపట్నం తదితర ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు అనుమానితుల నివాసాలను జల్లెడపట్టారు. ఈ దాడుల్లో 3 ల్యాప్ టాప్ లు, 3 హార్డ్ డిస్కులు, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులు, 2 పెన్ డ్రైవ్ లు, 6 మెమరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రవాదులు రక్తపుటేర్లు పారించిన నేపథ్యంలో ఉగ్రవాదుల తదుపరి లక్ష్యం భారత్ అని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ ఒక్క అనుమానితుడ్నీ వదలకూడదని ఎన్ఐఏ వర్గాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Related Tags