Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 20 వేల 903 మంది వైరస్​ సోకింది. మరో 379 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,544. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,27,439. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,79,892. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,213.
  • విజయవాడ: మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు. క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు వసంతరావు ఆచూకీ లభ్యం. గత నెల 24వ తేది అర్దరాత్రి క్రోవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు మృతి. అనంతరం మార్చూరుకి తరలించిన వైద్య సిబ్బంది. ఆసుపత్రిలో డాక్టర్లు నిర్లక్ష్యం. వృద్ధుడు వివరాలు ఆసుపత్రి రికార్డుల్లో నమోదుచేయని సిబ్బంది. దింతో మిస్టరీగా మరీనా వసంతారావు మిస్సింగ్. పోలీసుల రంగప్రవేశంతో వృద్ధుడు ఆచూకీ. గత 10 రోజులుగా కుటుంబ సభ్యులు వివరణ కోరిన సరైన వివరణ ఇవ్వని ఆసుపత్రి వర్గాలు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం తో గత 10 రోజులుగా ఆందోళనలో కుటుంబ సభ్యులు.. డాక్టర్లు తీరు పై కుటుంబ సభ్యులు ఆగ్రహం. ఆసుపత్రి సీసీ కెమెరాలలో వృద్ధుడు ఆచూకీ గమనించిన పోలీసులు. మార్చురీలో ఉన్న మృతదేహం వసంతరావుది కావడంతో విషాదంలో కుటుంబo.
  • అమరావతి: మంత్రివర్గ విస్తరణ 22న? రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్దం చేస్తునట్టు సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే అవకాశం. ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపిక పై కసరత్తు?
  • గుంటూరు: అరండల్ పేట పరిధిలో ప్రత్యర్దులను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన ఏడుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేసిన అర్బన్ పోలీసులు. రమణ అనే వ్యక్తి ని హత్య చేసేందుకు ప్లాన్ చేసిన రౌడీ షీటర్ బసవల వాసు హత్య కేసు నిందితులు.
  • ఎయిమ్స్ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన చిలకలూరిపేటకు చెందిన ప్రతాప్ కుమార్. వంద మార్కులకు గాను 91 మార్కులు సాధించిన ప్రతాప్ కుమార్.
  • విజయవాడ: మాజీ స్పీకర్ కోడెల కుమారుడు కోడెల శివరాంపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు. 2018లో పొలం కొనుగోలు చేసి 90 లక్షలు ఇవ్వటంలేదని పటమట పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. అధికార బలంతో అప్పట్లో డబ్బు ఇవ్వలేదని, గత ఏడాది నుంచి మధ్యవర్తి రాంబాబుకి ఇచ్చేసాను అని ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు. మధ్యవర్తి రాంబాబును కలిస్తే రివాల్వర్ తో బెదిరిస్తున్నదని పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్. గత నెల 25న ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో సీపీకి ఫిర్యాదు చేయనున్న అనంత్.
  • క్లినికల్ ట్రైల్స్ కు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్ . నిమ్స్ కు పర్మిషన్ ఇచ్చిన ఐసీఎంఆర్ . ఇప్పటికే కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల వారికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న కిమ్స్. అనేకసార్లు అనేక వ్యాధులకు వ్యాక్సిన్ ట్రైల్స్ నిర్వహించిన నిమ్స్.

ఎన్ఐఏలో క‌రోనా క‌ల‌క‌లం..ఏఎస్ఐకి పాజిటివ్

కోవిడ్-19 భూతం ఇప్ప‌టివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ల‌కు పాకిన వైర‌స్..ఇపుడు ఎన్ఐఏను తాకింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ..
NIA ASI tests positive for COVID-19 in Mumbai, ఎన్ఐఏలో క‌రోనా క‌ల‌క‌లం..ఏఎస్ఐకి పాజిటివ్
క‌రోనా ఉధృతికి మ‌హారాష్ట్ర చిగురుటాకుల వ‌ణికిపోతోంది. దేశంలోనే అత్య‌ధిక కేసుల‌తో ఆ రాష్ట్రం టాప్‌లో ఉంది. మురికివాడ‌ల నుంచి వీఐపీలు, సెల‌బ్రిటీల నివాసాల వ‌ర‌కు కోవిడ్ వైర‌స్ వేగంగా విస్త‌రిస్తూ డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక రాజ‌ధాని ముంబ‌య్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న క‌రోనా ఇప్పుడు ఎన్ ఐఏకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.
కోవిడ్-19 భూతం ఇప్ప‌టివ‌ర‌కు పోలీస్ స్టేష‌న్ల‌కు పాకిన వైర‌స్..ఇపుడు ఎన్ఐఏను తాకింది. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అసిస్టెంట్ స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్ కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా..క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ముంబై ఎన్ఐఏ ఆఫీసులో స‌ద‌రు వ్య‌క్తి ఏఎస్ ఐగా గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఎన్ఐఏ బృందం కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న వారు ఎవ‌రైనా..క‌రోనా పాజిటివ్ గా వ‌చ్చిన ఏఎస్ఐతో స‌న్నిహితంగా మెలిగారా అనే విష‌యంపై ఆరా తీస్తున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ముందు జాగ్ర‌త్త‌గా ఆఫీస‌ర్లంద‌రికీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి..అనుమానిత లక్షణాలున్న వారిని క్వారంటైన్ లో ఉంచ‌నున్న‌ట్లు ఎన్ఐఏ అధికార ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.
ఇదిలా ఉండ‌గా, ఆసియాలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన ముంబైలోని ధారావిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన‌ట్లుగా తెలుస్తోంది.  ఇరుకైన వీధులు, అపరిశుభ్ర వాతావరణంతోపాటు ఒకే గదిలో పది నుంచి ఇరవై మంది వరకూ నివసించే ధారావిలో క‌రోనా వైరస్‌ వ్యాప్తి కలకలం రేపింది. పెద్దఎత్తున పాజిటివ్ కేసులు బయ‌ట‌ప‌డ‌టం స్థానికులను, అధికారయంత్రాంగాన్ని ఆందోళ‌నకు గురిచేసింది. అయితే గ‌త రెండు మూడు రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్న‌ది. శుక్రవారం అతి తక్కువగా కేవలం ఐదు కేసులు మాత్రమే నమోదైన‌ట్లు అక్క‌డి అధికారులు వెల్ల‌డించారు.

Related Tags