వైద్య ఉద్యోగుల కోసం.. ఉచితంగా ఉబర్ సర్వీసులు..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా వైద్య ఉద్యోగుల కోసం ఉచితంగా ఉబర్ మెడిక్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది.

వైద్య ఉద్యోగుల కోసం.. ఉచితంగా ఉబర్ సర్వీసులు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 3:58 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సందర్భంగా వైద్య ఉద్యోగుల కోసం ఉచితంగా ఉబర్ మెడిక్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్యసేవలు అందిస్తున్న వైద్యఆరోగ్యశాఖ కార్యకర్తలను వారి ఇళ్ల నుంచి  ఆసుపత్రులకు తీసుకువచ్చేందుకు ఉబర్ ఉచితంగా 150 కార్లను నడపాలని నిర్ణయించింది. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, కాన్పూర్, లక్నో, ప్రయాగరాజ్, పట్నా నగరాల్లో మెడిక్ సర్వీసులు నడిపేందుకు ఉబర్ అంగీకరించింది.

కాగా.. జాతీయ ఆరోగ్యసంస్థతో కలిసి నడిపే ఈ కార్లలో డ్రైవర్లకు కరోనా వైరస్ సోకకుండా హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్, స్ప్రేయర్లు, ఫేస్ మాస్క్ లు అందించారు. కారు ముందు సీటులో ఎవరూ కూర్చోకుండా డ్రైవరుకు ప్లాస్టిక్ షీటుతో మూసివేశారు. కరోనా ప్రబలుతున్న కష్టకాలంలో ఉబర్ మెడిక్ ఉచిత సర్వీసులు నడపటాన్ని పలువురు అభినందించారు.