Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 24 వేల 850 మంది వైరస్​ సోకింది. మరో 613 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు2,44,814. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 4,09,083. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 19,268.
  • కోవిడ్-19 వార్ రూమ్ ఏర్పాటు చేయనున్న ఢిల్లీ సర్కారు
  • మర్డర్ సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేసిన మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు. వెంకటేశ్వరరావు డిఎస్పి మిర్యాలగూడ.
  • రేపటి నుండి తెరుచుకోనున్న హైదరాబాద్లోని పలు మార్కెట్లు. బేగంబజార్ ట్రూప్ బజార్,జనరల్ బజార్ మార్కెట్లు. కరోనా భయం తో స్వచ్చందంగా షాప్స్ మూసేసి షొప్స్ యజమానులు . 10 రోజుల తరువాత రెపటినుండి యధాతధంగా నడవనున్న మార్కెట్లు.
  • విశాఖ: డీజీపీ గౌతం సవాంగ్ కామెంట్స్ పోలీస్ రోడ్ పై నిలబడి సేవచేయాలంటే కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంది కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు విధినిర్బహణలో ఉన్నారు లాక్ డౌన్ సమయంలో ఫారెన్ రిటర్నీస్ ను సమర్ధంగా కట్టడిచేయగలిగాం -కంటైన్మెంట్ స్ట్రాటజీ పక్కాగా అమలు చేయగలిగాం వైరస్ పై ఇంకా అవగాహన పెరగాలి.. అందరూ మాస్క్ ధరించాలని చెబుతున్నాం.. అవగాహన పెంచుతున్నాం
  • రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని మోదీ భేటీ. లద్దాఖ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన వెంటనే భేటీ. సరిహద్దు ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మద్ధతు సహా పలు అంశాలపై చర్చ.

పెళ్లైన కొద్ది గంటల్లోనే.. వధూవరులతో సహా 100 మంది క్వారంటైన్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది
Newly-married couple quarantined, పెళ్లైన కొద్ది గంటల్లోనే.. వధూవరులతో సహా 100 మంది క్వారంటైన్..

Newly-married couple quarantined: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది గంటల్లోనే వధూవరులతో సహా సుమారు 100 మంది బంధుమిత్రులను క్వారెంటైన్‌కు తరలించిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలో చోటుచేసుకుంది. వధువు బంధువుకు కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతోనే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని జిల్లా అధికారి వెల్లడించారు.

కాగా.. సెంట్రల్‌ ఇండిస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌)లో వధువు బంధువు ఒకరు విధులు నిర్వర్తిస్తున్నారు. గతవారం ఆయన ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న తన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతను జిల్లా సరిహద్దుల్లో ప్రవేశిస్తుండగా అధికారులు స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపి అనుమతించారు. ఇంటికి వచ్చాక అతను ఇతర ప్రాంతాల్లోని కొందరు బంధువులను కలిశారు. అలాగే మే 26న ఛింద్వారాలో జరిగిన తన మరదలి పెళ్లికి హాజరయ్యారు.

మరోవైపు.. అతనిలో గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేశామని, వైరస్‌ సోకినట్లు మంగళవారం నిర్ధారణ అయిందని కలెక్టర్‌ సౌరభ్‌ సుమన్‌ స్పష్టంచేశారు. ఆ వ్యక్తి తన మరదలి పెళ్లికి హాజరవ్వడంతో నూతన వధువరులతో సహా మొత్తం కుటుంబసభ్యులను, పెళ్లికి హాజరైన వారిని మూడు ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తరలించామని తెలిపారు. తర్వాత అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు.

Related Tags