Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..!

newdelhi erupts in violence over death of gangrape victim in unnao, ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..!

యూపీలోని ఉన్నావ్ లో 23 ఏళ్ళ రేప్ బాధితురాలి మృతిపై ఢిల్లీలో యువత గళమెత్తింది. ఆమె మరణానికి కారకులైన మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో విద్యార్థినులు, మహిళలు కదం తొక్కారు. మొదట కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వారు ఆ తరువాత ఇండియాగేట్ వద్దకు ప్రదర్శనగా రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే వాటిని ఛేదించుకుని రాబోయిన వారిపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. కొన్ని చోట్ల నినాదాలు చేస్తూ దూసుకువస్తున్న నిరసనకారులను అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అటు ఉన్నావ్ లో బాధితురాలి అంత్యక్రియల సందర్భంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ప్రజలు.. పోలీసులను ఆ ఛాయలకు రాకుండా అడ్డుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. స్వయంగా వఛ్చి తమ కుటుంబానికి న్యాయం చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే హైదరాబాద్ లో దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ పై దేశవ్యాప్త సంచలనం రేగిన నేపథ్యంలో.. ఇలాంటి మృగాళ్లను ఉరి తీయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఉన్నావ్ రేప్ బాధితురాలి కుటుంబం కూడా తమ కూతురికి జరిగిన అన్యాయానికి, ఆమె మృతికి కారకులైన కీచకులను ఎన్‌కౌంటర్ చేయాలని కోరుతోంది.

కాగా.. బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా నిర్వహించారు. బాధితురాలి మరణానికి కారుకులైన నిందితులపై హత్యాభియోగాలు మోపుతామని, కఠిన శిక్షలు విధిస్తామని వారు ఇచ్చిన హామీతో.. ఆమె కుటుంబీకులు అంత్య క్రియలకు వారిని అనుమతించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఇంటిని మంజూరు చేస్తామని కూడా వాగ్ధానం చేశారు.

newdelhi erupts in violence over death of gangrape victim in unnao, ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..! newdelhi erupts in violence over death of gangrape victim in unnao, ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..! newdelhi erupts in violence over death of gangrape victim in unnao, ఉన్నావ్ రేప్‌ బాధితురాలి అంత్యక్రియలు పూర్తి.. ఢిల్లీలో ఉద్రిక్తతలు..!