వ‌ర‌ల్డ్ క‌ప్ – వార్మ‌ప్ మ్యాచ్‌ : 179కే కుప్ప‌కూలిన భార‌త్

వరల్డ్ కప్ క్రికెట్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా లండన్ మైదానంలో ఇవాళ భారత్.. న్యూజిలాండ్‌తో తలపడుతోంది. ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పేలవంగా ఉంది. కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. 39.2 ఓవర్లలోనే భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే కేవలం 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో పాండ్యా 30, జ‌డేజా 54 ప‌రుగులు చేయ‌గా, ధోని 17, కోహ్లీ 18, కుల‌దీప్ 19 ప‌రుగులు చేశారు. మిగిలిన వారెవ‌రూ కనీసం రెండంకెల స్కోర్ దాట‌లేదు. ఇక న్యూజిల్యాంగ్ బౌలింగ్‌లో బౌల్ట్ కి 4, నిషామ్ కి 3 వికెట్లు ల‌భించాయి. సౌథి, గ్రాండ్ హోం, పెర్గ్ స‌న్‌కి త‌లో వికెట్ వ‌చ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *