“బిడ్డ” కు జన్మనివ్వబోతున్న “మహిళా క్రికెటర్లు”..

New Zealand Womens Cricket Captain Amy Satterthwaite Announces Pregnancy, “బిడ్డ” కు జన్మనివ్వబోతున్న “మహిళా క్రికెటర్లు”..

న్యూజిలాండ్‌కి చెందిన మహిళా క్రికెటర్లు అమీ సత్తర్ వైట్, లియా తహుహులు లెస్బియన్‌ దంపతులు త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. లియా, అమీ 2014లో నిశ్చితార్థం చేసుకొని 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం నాలుగేళ్లు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్లిద్దరూ న్యూజిలాండ్ జాతీయ జట్టు తరపున ఆడారు. అమీ మహిళా క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ కాగా తహుహు అదే జట్టులో సీనియర్‌ బౌలర్‌. మున్ముందు కూడా ప్రొఫెషనల్‌ క్రికెట్ లో కొనసాగుతామని వీరు చెప్పారు. 2020 జనవరిలో తమ కుటుంబంలోకి బేబీ ”సత్తర్‌హుహు” రాబోతుందని అమీ ట్విటర్‌లో వెల్లడించారు. వచ్చే ఏడాది ఆరంభంలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు లియా, నేను ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తమ జీవితంలో కొత్త చాప్టర్‌ ప్రారంభం కాబోతోందని అమీ ట్వీట్ చేసింది. దాంతో పాటు చిన్నారి కోసం కొన్న డ్రెస్ ను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *