టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడి ప్రభావం చాలా ఉంది. అనేక జట్ల సెమీస్ అవకాశాలు వర్షం కారణంగా తారుమారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య బర్మింగ్ హామ్ లో జరగాల్సిన మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ జట్టుకు ఫీల్డింగ్‌ అవకాశం ఇచ్చింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య 33వ మ్యాచ్ జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఔట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండడంతో టాస్‌ను కొంత సేపు వాయిదా వేశారు.

Toss delayed due to wet outfield

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *