వరల్డ్ కప్ 2019: కివీస్‌పై ఆసీస్‌ ఘనవిజయం

లార్డ్స్‌: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్‌లో ఇరు జట్లు చాలా బలీయంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ..టైటిట్ రేస్‌లో జోరుచూపిస్తున్నాయి. నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది. బౌలర్స్ డామినేషన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో ఆసిస్.. న్యూజిలాండ్‌ను ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే […]

  • Ram Naramaneni
  • Publish Date - 2:56 am, Sun, 30 June 19

లార్డ్స్‌: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరల్డ్ కప్‌లో ఇరు జట్లు చాలా బలీయంగా ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణిస్తూ..టైటిట్ రేస్‌లో జోరుచూపిస్తున్నాయి. నేడు ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇప్పటికే సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న కంగారూ జట్టు.. మరో విజయాన్నందుకుంది.

బౌలర్స్ డామినేషన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 86 పరుగుల తేడాతో ఆసిస్.. న్యూజిలాండ్‌ను ఓడించింది. 244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ 43.4 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. 40 పరుగులు చేసిన కెప్టెన్‌ విలియమ్సనే ఆ జట్టులో టాప్‌స్కోరర్‌.మిచెల్‌ స్టార్క్‌ (5/26) మ్యాజిక్ బౌలింగ్‌తో కివీస్‌ పతనాన్ని శాసించాడు. బెరెన్‌డార్ఫ్‌ (2/31) కూడా తన పని పూర్తిచేశాడు.

అంతకుముందు కివీస్ బౌలర్ల  ధాటికి ఆసీస్‌ ఒక దశలో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా.. ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4)ల అద్భుత పోరాటంతో పుంజుకుని 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన బౌల్ట్‌.. వరుస బంతుల్లో ఖవాజా, స్టార్క్‌, బెరెన్‌డార్ఫ్‌లను ఔట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. బౌల్ట్‌కు వన్డేల్లో ఇది రెండో హ్యాట్రిక్‌. ఈ ప్రపంచకప్‌లో షమి తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్‌ అతనే. వరుసగా ఐదు విజయాలు సాధించిన కివీస్‌కు.. ఇది వరుసగా రెండో ఓటమి.